కర్నూల్ లో అరుదైన శస్త్ర చికిత్స..!

కర్నూల్ లో కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు.ఆటలు ఆడేటప్పుడు జరిగే గాయాల వల్ల ఎంతటి అనర్థాలు సంభవిస్తాయో చెప్పడం కష్టం.

దెబ్బను పట్టించుకోకుండా వదిలేయడంతో సమస్య మరింత తీవ్రమవుతుంది.ఓ వ్యక్తికి నాలుగేళ్ల క్రితం గాయం తగిలింది.

నిర్లక్ష్యం చేయడంతో అతడి చేతి కదలికలు దాదాపుగా కోల్పోయే పరిస్థితి నెలకొంది.దీంతో కిమ్స్ వైద్యులు అతడికి అరుదైన శస్త్ర చికిత్సను చేశారు.

లెటార్జెట్ ప్రొసీజర్ అనే శస్త్ర చికిత్సను చేసి చేతి కదలికలను పునరుద్ధరించారు.కిమ్స్ కర్నూల్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ జీవీఎస్ రవిబాబు ఆధ్వర్యంలో ఈ శస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసింది.

అనంతపురం జిల్లాకు చెందిన గోపిచంద్(20) అనే యువకుడు నాలుగేళ్ల కిందట క్రికెట్ ఆడుతూ జారిపడ్డాడు.

దీంతో అతడి కుడి చేతి ఎముక పక్కకు జరిగింది.చిన్న నొప్పే అనుకుని నిర్లక్ష్యం చేశారు.

అలా నాలుగేళ్లు నిర్లక్ష్యం చేస్తూనే ఉండటంతో ఆ ఎముక 30 నుంచి 40 సార్లు పక్కకు జరిగింది.

దీంతో బాధ మరింత పెరిగింది.గోపిచంద్ తల్లి అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వహిస్తోంది.

వైద్యుల సహకారంతో కిమ్స్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు.పరీక్షలు నిర్వహించిన వైద్యులు గ్లెనాయిడ్ కప్ అరిగిపోయిందని, కొంచెం కదిలినా ఎముక పూర్తిగా జారిపోతుందన్నారు.

దీంతో శస్త్ర పరీక్ష చేసి కండరాలను అతికించి పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు.

ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఆ రెండు ప్రకటనలు వస్తాయా.. ఆ అప్ డేట్స్ వస్తే మాత్రం పండగేనంటూ?