గాజు శరీరంతో ఉన్న అరుదైన ఆక్టోపస్.. !

సముద్రంలో ఎన్నో రకాలు అయిన జీవులు నివసిస్తూ ఉంటాయి.వాటిలో కొన్ని జీవులు మనకి తెలిసినవి అయితే మరికొన్ని మనకు తెలియని అరుదైన జీవులు కూడా ఉంటాయి.

వాటిని ఎప్పుడన్నా చూస్తే మనం చాలా ఆశ్చర్యపోతాము కదా.ఇలాంటి మనకు తెలియని ఒక జీవి ఉందా అని అనుకుంటాము కదా.

అయితే ఇప్పుడు అలాంటి ఒక అరుదైన వింతగా కనిపించే ఒక అక్టోపస్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మనలో చాలా మంది ఆక్టోపస్ ని చూసే ఉంటారు.వాళ్ళు అనుకోవచ్చు ఆక్టోపస్ మనం చూసాము కదా.

మరి ఇందులో పెద్ద వింత ఏమి ఉంది అని అనుకోవచ్చు.కానీ మనం చుసిన ఆక్టోపస్ లాగా ఈ ఆక్టోపస్ లేదు.

గాజు లాంటి శరీరంతో చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది.ఈ అరుదైన ఆక్టోపస్ ను ఎంతో కష్టపడి మరి ఫోటోలు తీసి మన ముందు ఉంచారు సముద్ర సైంటిస్టులు.

ఈ ఆక్టోపస్ ఫసిఫిక్ మహా సముద్రంలో దర్శనం ఇచ్చింది.ఈ ఆక్టోపస్ కోసం దాదాపు 34 రోజుల పాటు సమయం కేటాయించి మరి ప్రయోగం జరిపారట సముద్ర సైంటిస్టులు.

సముద్రాలలో 30వేల కిలోమీటర్ల కంటే లోతుకు వెళ్లిన బృందానికి ఇది కనిపించింది.ఇంకేముంది సైంటిస్టులు తమ కెమెరాకు పని పెట్టారు.

ఇది చాలా అరుదైన జీవి అని, దీని శరీరం పూర్తిగా ట్రాన్స్‌పరేంట్‌గా ఉందని చెప్తున్నారు.

శరీరం లోపల ఉన్న ఆప్టిక్ నెర్వ్, కళ్లు, జీర్ణ వ్యవస్థ కూడా స్పష్టంగా కనిపించాయట.

"""/"/ మన అందరికి కనిపించని సముద్ర లోపలి భాగాన్ని బయటపెట్టడానికి ఈ జీవి చాలా ఇన్‌స్పైరింగ్ గా ఉంటుందని ఎక్స్‌పెడిషన్ ఛీఫ్ సైంటిస్ట్ డా.

రండీ రోజన్ తెలుపుతున్నారు.అలాగే గతంలో కనిపించిన జీవులు కంటే ఇది చాలా అరుదైనదిగా కనిపించినది అని అన్నారు.

ఈ గాజు శరీరంతో కూడిన ఆక్టోపస్ లైవ్ ఫుటేజ్ చాలా అద్భుతంగా ఉందంటూన్నారు.

ఈ క్రమంలో ఆ జీవిపై మరిన్ని పరిశోధనలు జరపవచ్చు అనే తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఆక్టోపస్ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.ఫోటోలు చుసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోక మానరు.

ఇంకా ఇలాంటి వింతయినా జీవులు సముద్ర అడుగు భాగంలో మరెన్ని ఉన్నాయో అని ఆలోచనలో పడ్డారు అందరు.

ఈ రేడియోయాక్టివ్ మెటీరియల్ వద్దకు వెళ్తే 5 నిమిషాల్లో మరణం తథ్యం..?