జాలర్ల వలకు చిక్కిన అరుదైన చేప..!

సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు వలలో చేపలతో పాటు ఒక్కోసారి రకరకాల జంతువులు కూడా పడతాయి.

అలాగే చేపల వేటకు వెళ్ళినప్పుడు మత్స్యకారులు చిన్న చిన్న వలలు వేసి చేపలు పడుతుంటారు.

కాని సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు మాత్రం పెద్ద వలలు ఉపయోగిస్తుంటారు.ఈ క్రమంలోనే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఒక భారీ చేప పెద్ద వలలో చిక్కింది.

మొదట్లో అసలు ఇది చేపయేనా లేక మరేమైనానా అని ఆశ్చర్యానికి లోనయ్యారు.ఈ భారీ చేపను చూడడానికి అక్కడి స్థానికులు తండోపతండాలుగా తరలి వచ్చారు.

ఇక అసలు వివరాల్లోకి వెళితే.తూర్పు గోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ హార్బర్‌లో సుమారు 750 కేజీల బరువుండే భారీ చేప ఒకటి వలలో చిక్కింది.

అది టేకు చేపగా గుర్తించారు మత్స్యకారులు.ఈ చేప ఉప్పాడ మత్స్యకారులకు వలలో చిక్కింది.

ఈ చేపను వలలో నుంచి బయటకు తీయడానికి ఒక పెద్ద క్రైన్ నే తెప్పించారు.

ఆ భారీ క్రేయిన్ సహకారంతో బోటు నుండి మినీ వాన్ పైకి కూడా ఎక్కించి ఆ చేపను కాకినాడ మార్కెట్టుకు తరలించారు.

ఇంత పెద్ద భారీ చేపను మునుపెన్నడూ చూడలేదని మత్స్యకారులు అంటున్నారు.అలాగే ఈ టేకు చేపను చూడడానికి చుట్టుపక్కల జనాలు సైతం తరలివచ్చారు.

ఇంత పెద్ద చేపను చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.అసలు ఇది చేపయేనా అని చాలామంది అనుమానం కూడా వ్యక్తం చేసారు.

చివరకు అది ఒక టేకు చేప అని నిర్ధారించారు. """/" / ఎంతో కష్టపడి ఆ చేపను ఒడ్డుకు చేర్చిన మత్స్యకారులు దానిని మార్కెట్‌ కు తరలించడానికి పెద్ద అడ్వెంచర్ చేసారని చెప్పాలి.

ఎందుకంటే అది ఒకటి, రెండు కాదు ఏకంగా 750 కేజీల బరువు ఉంది.

750 కేజీల బరువు అంటే మాటలా చెప్పండి.అందుకనే ఆ చేపను సముద్రం నుంచి మార్కెట్‌ కు తరలించడానికి క్రేన్లు ఉపయోగించాల్సి వచ్చింది.

ట్రక్కులో తరలించడం కూడా కొద్దిగా కష్టంగానే మారింది.ఇదిలా ఉంటే సముద్రంలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా అరుదు అనే చెప్పాలి.

750 కిలోల టేకు చేప మత్స్యకారుల వలకు చిక్కడంతో వారంతా ఒక్కసారిగా ఆనందపడ్డారు.

ప్రస్తుతం ఈ భారీ చేప యొక్క వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

మరి మీరు కూడా ఒక లుక్ వేసేయండి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి22, బుధవారం 2025