అరుదైన జీవి లభ్యం.. స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు

భూమిపై లక్షలాది జాతుల జీవులు ఉన్నాయి.భారతదేశంలో మాత్రమే కనిపించే చాలా అరుదైన జంతువులు ఉన్నాయి.

వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం వాటిని వేటాడడం, స్మగ్లింగ్ చేయడం, క్రయవిక్రయాలు చేయడం చట్ట విరుద్ధం.

అయినప్పటికీ చాలా మంది యథేచ్చగా స్మగ్లింగ్ చేసేస్తున్నారు.వాటిని అరికట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, స్మగ్లర్లు కొత్త ఎత్తులు వేస్తూనే ఉన్నారు.

ఇటువంటి తరుణంలో ఎక్కడైనా అరుదైన ఆ జంతువులు కనపడితే అటవీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో అరుదైన జీవి 'అలుగు' ప్రత్యక్షమైంది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

"""/" / భారతీయ పాంగోలిన్ లేదా అలుగుగా పిలిచే ఆ జీవి ప్రధానంగా చీమలు, చెదపురుగులను తింటూ జీవిస్తుంది.

దీనికి ఉండే పొడవైన, జిగట నాలుకతో వాటిని పట్టుకుంటుంది.అంతేకాకుండా గుడ్లు, లార్వాలను కూడా ఆహారంగా స్వీకరిస్తుంది.

ఏదైనా సింహం, పులి వంటి ఇతరు క్రూర జంతువులు వేటాడడానికి వస్తే వెంటనే బంతిలాగా ముడుచుకుపోతుంది.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యాట్ల బసివలస గ్రామంలో స్థానికులు ఈ అరుదైన 'అలుగు'ను గమనించారు.

దానిని బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి.అయితే ఆ గ్రామస్తులు అలా చేయలేదు.

దానిని జాగ్రత్తగా దాచి, తమకు అలుగు దొరికిందనే సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.

దీంతో అప్రమత్తమైన టెక్కలి రేంజ్ అటవీ శాఖాధికారి పీవీ శాస్త్రి, దండు లక్ష్మీపురం సెక్షన్ అటవీశాఖాధికారి ఆర్.

వినోద్ కుమార్ సదరు గ్రామానికి వెళ్లారు.అలుగును స్వాధీనం చేసుకుని, గ్రామస్తులను అభినందించారు.

వెంటనే స్థానిక పశు వైద్యాధికారి షణ్ముఖ రావును అక్కడకు తీసుకొచ్చారు.ఆ అలుగు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.

అయితే అలుగు ఎవరికీ హాని చేయదని, చీమలు, చెదపురుగులు వంటివి తిని బ్రతుకుతుందని ఆయన తెలియజేశారు.

ఆ అలుగు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని స్పష్టం చేశారు.వెంటనే అలుగును విశాఖలో 'జూ'కు తరలించారు.

వైరల్ వీడియో: బట్టల దుకాణంలోకి దూసుకెళ్లిన ఎద్దులు.. చివరికి..?