అత్యాచారం.. ఆపై దారుణ హత్య.. గోప్యంగా ఉంచిన పోలీసులు.. ఎక్కడంటే..?

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్( Habsipur ) లో మహిళను హత్య చేసిన నిందితుడి ఇంటిని గ్రామస్తులు నిప్పంటించారు.

దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది.

దీనికి సంబంధించిన వివరాలు ఏమిటో పూర్తిగా చూద్దాం.వివరాల్లోకెళితే.

హబ్సిపూర్ గ్రామంలో గత నెల ఏడవ తేదీన బైండ్ల బాలవ్వ( Bindla Balavva ) (52) మృతి చెందగా.

ఆ రోజే అంత్యక్రియలు నిర్వహించారు.అయితే ఇంట్లో రక్తపు మరకలు గమనించిన ఆమె కుమారులకు అనుమానం రావడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

"""/" / పోలీసులు సెప్టెంబర్ 17న పూడ్చిన బాలవ్వ శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.

అనంతరం 17వ తేదీ రాత్రి మద్దెల నవీన్( Maddela Naveen ), అతని తల్లి చంద్రవ్వ( Chandravva ) ను పోలీసులు అనుమానితులుగా భావించి అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.

బాలవ్వ ను తామే హత్య చేసినట్లు వారు అంగీకరించారు.తరువాత 17వ తేదీ ఈ నిందితులను పోలీసులు రిమాండ్ కు పంపారు.

అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.బాలవ్వ ను హత్య చేసింది నవీన్, అతని తల్లి చంద్రవ్వ అని తాజాగా సోమవారం వెలుగులోకి రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు.

నిందితుడి ఇంట్లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పు పెట్టి దహనం చేశారు.

"""/" / అసలు విషయం ఏమిటంటే.బాలవ్వ ను నవీన్ అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.

ఈ విషయాన్ని విచారణలో నిందితులు అంగీకరించినట్లు సమాచారం.అయితే ఈ వ్యవహారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడంతో బాధిత కుటుంబం పోలీసులను నిలదీయడం.

చివరికి అసలు విషయం బయటకు రావడంతో గ్రామస్తులు ఆగ్రహానికి లోనయ్యారు.నిందితుల రిమాండ్ వ్యవహారం కూడా పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచారో అంతుపట్టడం లేదని గ్రామస్తులు ఆగ్రహించడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

దేవర మూవీ క్లోజింగ్ కలెక్షన్ల లెక్క ఇదే.. ఎన్టీఆర్ స్టామినాకు అసలు ప్రూఫ్స్ ఇవే!