జగన్ ను కలిసిన ఆ ఒక్క ఎమ్మెల్యే కారణం!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సమావేశాలకు హాజరయ్యారు.

ఈ క్రమంలో తొలుత ప్రొటెం స్పీకర్ ఏపీ మంత్రుల చేత,ఎమ్మెల్యేల చేత మరోసారి ప్రమాణ స్వీకారం చేయించారు.

అయితే ఈ సమావేశాలకు హాజరైన జనసేన పార్టీ ఆ ఒక్క ఎమ్మెల్యే (రాపాక వరప్రసాద్) శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఏపీ నూతన సీ ఎం జగన్మోహన్ రెడ్డిని ఆయన ఛాంబర్ కి వెళ్లి మరీ కలిసినట్లు తెలుస్తుంది.

కాసేపు ఇద్దరూ భేటీ అయి చర్చించినట్లు తెలుస్తుంది.అనంతరం సీఎం ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన వరప్రసాద్.

తాను మర్యాదపూర్వకంగానే సీఎం జగన్‌ను కలిశానని మీడియాకు వివరించారు. """/"/ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజోలు అసెంబ్లీ నియోజక వర్గంలో ఎన్నికల బరిలోకి దిగిన రాపాక వరప్రసాద్ విజయం సాధించడం తో ఎమ్మెల్యే గా ఎన్నికైన సంగతి తెలిసిందే.

జనసేన పార్టీ తరపున పోటీ చేసి నెగ్గిన ఒకే ఒక్క ఎమ్మెల్యే గా రాపాక నిలిచారు.

అయితే జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో ఆయన అధికార పార్టీ వైసీపీలో చేరబోతున్నారనే ఊహాగాలు వచ్చాయి.

అయితే తాను జనసేనలోనే ఉంటానని ఇటీవలే వరప్రసాద్ స్పష్టం చేశారు.అయితే ఇప్పుడు తాజాగా జగన్ తో నేరుగా భేటీ అవ్వడం తో మరోసారి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అప్పులు చేసి చదువు.. ఒక్క మార్కుతో ఫెయిల్.. జోయా మీర్జా సక్సెస్ స్టోరీకి హ్యాట్సాఫ్ అనాల్సిందే!