అపరిచితుడు హిందీ రీమేక్ కోసం ఆ హీరో ప్రయత్నాలు

దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో 15 ఏళ్ల క్రితం చియాన్ విక్రమ్ హీరోగా తెలుగు, తమిళ్ బాషలలో ప్రేక్షకుల ముందుకి వచ్చి సంచలన విజయం సొంతం చేసుకున్న సినిమా అపరిచితుడు.

ఈ సినిమా ఒక్కసారిగా విక్రమ్ ఇమేజ్ ని మార్చేసి స్టార్ హీరోల కేటగిరీలో చేర్చేసింది.

ఇక ఈ సినిమాతోనే విక్రమ్ విలక్షణ నటుడుగా ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.

కమల్ హసన్ తర్వాత ఆ స్థాయి నటుడుగా విక్రమ్ ప్రశంసలు అందుకోవడానికి కారణం అయిన సినిమా.

అలాగే జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డుని కూడా విక్రమ్ కి తెచ్చిపెట్టిన సినిమా అపరిచితుడు.

ఆ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే దర్శకుడు శంకర్ సినిమా ఎండ్ లో ఎలివేట్ చేశాడు.

దానికి సీక్వెల్ ప్లాన్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న వర్క్ అవుట్ కావడం లేదు.

ఇక ఈ సినిమా హిందీలో కూడా డబ్బింగ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

అయితే ఇప్పుడు ఈ సినిమాని అపరిచితుడు సీక్వెల్ ని హిందీలో ప్లాన్ చేయడం కోసం స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ నేపధ్యంలో రీసెంట్ గా దర్శకుడు శంకర్ ని కూడా ఈ హీరో కలవడం జరిగింది.

ఇక ఈ సీక్వెల్ సినిమాకి దర్శకత్వం వహించాలని శంకర్ ని రణవీర్ కోరినట్లు తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం శంకర్ టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ తో పాన్ ఇండియా మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నాడు.

ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ నేపధ్యంలో అపరిచితుడు హిందీ అపరిచిత్ రీమేక్ పై శంకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది.

మరి 15 ఏళ్ల క్రితం తన దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని ఎన్నేళ్ళ తర్వాత హిందీలో సీక్వెల్ చేయడానికి శంకర్ ఒకే అంటాడా అనేది వేచి చూడాలి.

రామ్ చరణ్ అంటే నాకెంతో ఇష్టం.. మానుషి చిల్లర్ కామెంట్స్ వైరల్