పెళ్లికూతురు గెటప్ లో కచ్చా బాదం పాటపాడిన రాను మండల్...వీడియో వైరల్!

సాధారణంగా అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుంది ఎవరికీ తెలియదు.ఇలా అదృష్టం తలుపు తట్టి చాలా మంది రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మారిపోయారు.

ఇలా రాత్రికిరాత్రే సెలబ్రిటీగా మారిన వారిలో రేణు మండల్ ఒకరు.రాత్రికి రాత్రే స్టార్ సింగర్ గా సోషల్ మీడియా వార్తలలో నిలిచిన రాను మండల్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.

తాజాగా ఈమె పెళ్లి కూతురు గెటప్ లో అందంగా ముస్తాబై కచ్చ బాదం పాట పాడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఎరుపు రంగు చీర ధరించి ఒంటినిండా నగలు వేసుకొని అందంగా ముస్తాబై రాను మండల్ కచ్చా బాదం పాట పాడుతూ ఉన్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఈ వీడియో ఫేస్ బుక్ యూట్యూబ్ లను షేక్ చేస్తోంది.బెంగాలీ పెళ్లి కూతురుగా ముస్తాబై బెంగాలీ పాటను పాడుతూ రాను మండల్ సందడి చేశారు.

ఇక ఈ పాటను పశ్చిమబెంగాల్ కు చెందిన వేరుశనగ విక్రేత భుభన్ బధ్యకర్ పాడిన ఈ పాట ఎంతో పాపులర్ అయింది.

"""/" / ఈ క్రమంలోనే ఈ పాటకు ఎంతోమంది సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రజల వరకు రీల్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఇకపోతే తాజాగా రాను మండల్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అతి తక్కువ సమయంలోనే వైరల్ గా మారింది.

ఈ వీడియోకి వేల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ రావడం విశేషం.

సీఎం పదవినే వద్దనుకున్న సోనూసూద్.. ఈ హీరో నిజంగా గ్రేట్ అని అనాల్సిందే!