హెల్త్‌కేర్ ఇండస్ట్రీలను టార్గెట్ చేసిన ర్యాన్సమ్‌వేర్… ఎందుకంటే?

ఇంటర్నెట్ ప్రపంచం విస్తరించేకొద్దీ హ్యాకర్లు కూడా రకరకాల దారుల్లో కంప్యూటర్లపై సైబర్ అటాక్స్( Cyber ​​attacks ) చేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే ర్యాన్సమ్‌వేర్.ఇది అత్యంత ప్రమాదకరమైన దాడిగా సైబర్ ఎక్స్‌పర్ట్స్ చెబుతూ వుంటారు.

ఈ సైబర్ అటాక్‌లో హ్యాకర్లు ముఖ్యమైన ఫైల్స్‌ను లాక్ చేసి, వాటిని అన్‌లాక్ చేయడానికి సదరు సంస్థ నుండే డబ్బుని డిమాండ్ చేస్తూ వుంటారు.

అలా ఇటీవల కాలంలో అయితే హెల్త్‌కేర్ ఆర్గనైజేషన్లపై ఈ దాడులు ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ దాడులకు అత్యంత లక్ష్యంగా ఉన్న 4 సెక్టార్లలో హెల్త్‌కేర్ ఇండస్ట్రీ ఒకటిగా నిలుస్తోంది.

"""/" / ARETE (గ్లోబల్ సైబర్ రిస్క్ మేనేజ్‌మెంట్ కంపెనీ అరేటే) తాజా రిపోర్టు ప్రకారం, అన్ని ర్యాన్సమ్‌వేర్ దాడులలో 13 శాతం అటాక్స్‌ ఆరోగ్య సంరక్షణ సంస్థలపైనే జరుగుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.

బాధిత సంస్థలలో ర్యాన్సమ్‌ను చెల్లించడానికి 73.7 శాతం సంస్థలు మోగ్గు చూపుతున్నాయని కూడా రిపోర్ట్ పేర్కొంది.

ర్యాన్సమ్‌వేర్ దాడులు సర్వసాధారణం కావడంతో, సంస్థలు దెబ్బతినే నష్టాన్ని తగ్గించడానికి చర్యలు కూడా తీసుకుంటున్నాయి.

కాగా ముఖ్యమైన డేటాను బ్యాకప్‌ చేయడం, MFA (మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్), EDR (ఎండ్‌పాయింట్ డిటెక్షన్ & రెస్పాన్స్) వంటివి ఆరోగ్య సంస్థలను రక్షించడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయని రిపోర్టు తెలిపింది.

"""/" / ARETE చీఫ్ డేటా ఆఫీసర్ క్రిస్ మార్టెన్సన్( Chris Martenson ) మాట్లాడుతూ.

"హ్యాకర్లు హెల్త్‌కేర్ సంస్థలపై ర్యాన్సమ్‌వేర్ అటాక్స్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.ఎందుకంటే, ఈ సంస్థల కంప్యూటర్ల డేటాలో అత్యంత సున్నితమైన ఆరోగ్య సమాచారం ఉంటుంది కాబట్టి.

సదరు సమాచారం కొరకు సంస్థలు డబ్బు చెల్లించే అవకాశం కూడా చాలా ఎక్కువ.

" అని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం 25 శాతం కంటే తక్కువ హెల్త్‌కేర్ సంస్థలు మల్టీ-ఫాక్టర్ అథెంటికేషన్ (MFA)ని ఉపయోగిస్తున్నాయి.

అయితే ఒక్క ఎండ్‌పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ (EDR) ప్లాట్‌ఫామ్‌తోనే హెల్త్‌కేర్ సెక్టార్‌లో ర్యాన్సమ్‌ చెల్లించే అవకాశాలను చాలావరకు తగ్గించుకోవచ్చని నివేదిక పేర్కొంది.

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు తోడు దొంగలే..: మోదీ