‘రంగ్‌ దే’ లిరికల్‌ వీడియో సాంగ్‌ రిలీజ్‌ కు కొత్త డేట్‌ ఫిక్స్‌..!

యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం లో తాజాగా తెరకెక్కుతున్న సినిమా రంగ్ దే.

సూర్యదేవర నాగవంశీ ఆధ్వర్యంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాని పిడివి ప్రసాద్ సమర్పిస్తున్నారు.ఈ సినిమాలో హీరోగా నితిన్ నటిస్తుండగా ఆయన సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది.

ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఇక అసలు విషయంలోకి వెళితే.

ఇదివరకు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు అలాగే మొదటగా లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం.

అయితే ఈ పాటకు వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసేందుకు సిద్ధమైన తరుణంలో సినిమా సమర్పకుడు ప్రసాద్ భార్య గుండెపోటు కారణంగా మృతి చెందడంతో ఆ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

అయితే మళ్లీ ఈ పాటకు సంబంధించి వీడియోను ఎప్పుడు విడుదల చేస్తారో తేదీని ప్రకటించింది.

తాజాగా ఈ లిరికల్ వీడియో రిలీజ్ డేట్ నవంబర్ 12 సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా తెలియజేశారు.

నితిన్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, కౌసల్య, బ్రహ్మాజీ, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, వినీత్ మొదలైన వారు ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ గా పి.సి.

శ్రీరామ్ సేవలందిస్తున్నారు.లాక్ డౌన్ ముందు భీష్మ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ అందరినీ అలరించాడు.

మరోసారి రంగ్ దే అంటూ ప్రేక్షకులందరికీ అతి త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

చూడాలి మరి ఈ సారి ఏవిధంగా హీరో నితిన్ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో.

వీడియో: స్విమ్మింగ్ పూల్‌లో స్టంట్.. కట్ చేస్తే యువకుడు డెడ్?