చరణ్ ‘రంగస్థలం’ స్పెషల్ షో.. జపాన్ లో గ్లోబల్ స్టార్ హవా చూపిస్తాడా?
TeluguStop.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన కెరీర్ లో అందుకున్న బ్లాక్ బస్టర్ విజయాల్లో ''రంగస్థలం'' ( Rangasthalam ) ఒకటి.
ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేయగా రామ్ చరణ్ ( Ram Charan ) హీరోగా నటించాడు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా 2018, మార్చి 30న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఈ సినిమాలో చరణ్ చిట్టిబాబు గా నటించి తన లోని టాలెంట్ ను ప్రేక్షకులకు చూపించాడు.
అప్పటి వరకు చరణ్ నటనను ఈ కోణంలో చూడని మెగా ఫ్యాన్స్ సైతం ఆశ్చర్య పోయారు.
తనలోని నటనను మొత్తం బయటకు తీసి చూపించాడు.చిట్టిబాబు పాత్రకు జీవం పోసాడు.
ఈయన తప్ప మరొకరు ఈ పాత్రలో నటించలేరు అన్నంతగా చరణ్ జీవించాడు.రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాలో వీరిద్దరూ డీ గ్లామర్ రోల్స్ లో అదర గొట్టారు.
"""/" /
చిట్టిబాబుగా చరణ్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు.
యాక్షన్ అంశాలతో సుకుమార్ (Sukumar) ఈ సినిమాను ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించి టాలీవుడ్ కు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు.
మరి ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇప్పుడు స్పెషల్ షోకు సిద్ధం అయ్యింది.
అదీ ఇక్కడ కాదు జపాన్ లో చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా రంగస్థలం సినిమా స్పెషల్ షోను వేయనున్నారు.
"""/" /
ఇటీవలే ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాను జపాన్ ( Japan ) లో రిలీజ్ చేయగా అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని మంచి కలెక్షన్స్ రాబట్టింది.
ఇక ఇప్పుడు చరణ్ క్రేజ్ ను అక్కడి ఫేమస్ డిస్టిబ్యూషన్ సంస్థ స్పేస్ బాక్స్ ఏప్రిల్ 9,10,11 తేదీలలో ఈ సినిమాకు స్పెషల్ షోలు వేయడానికి సిద్ధం అయ్యింది.
మొత్తానికి చిట్టిబాబు జపాన్ లో కూడా రీసౌండ్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు.మరి జపనీయులు ఈ సినిమాను ఎలా ఆదరిస్తారో చూడాలి.
పాజిటివిటీ గోరంత నెగిటివిటీ కొండంత.. బన్నీకి బ్యాడ్ టైమ్ నడుస్తోందిగా!