ఉప్పెనలో రంగస్థలం.. ఏ విధంగానో తెలుసా?

ఉప్పెనలో రంగస్థలం ఏ విధంగానో తెలుసా?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో మంచి క్రేజ్‌ను దక్కించుకున్న సినిమాగా ‘ఉప్పెన’ నిలిచింది.మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో వైష్ణవ్ తేజ్ పరిచయమవుతున్న ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఉప్పెనలో రంగస్థలం ఏ విధంగానో తెలుసా?

కాగా ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

ఉప్పెనలో రంగస్థలం ఏ విధంగానో తెలుసా?

అయితే ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చూసినా, కరోనా కారణంగా అది వాయిదా పడుతూ వస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఉప్పెన చిత్రంలో రంగస్థలం చిత్రానికి సంబంధించిన ఛాయలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఉప్పెన చిత్రంలో విలన్ పాత్రలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఆయన పాత్ర ఈ సినిమాలో చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, అంతే స్థాయిలో ఈ సినిమాకు అది కీలకం కానున్నట్లు తెలుస్తోంది.

గతంలో సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రంలో ప్రెసిడెంట్ పాత్రలో జగపతిబాబు ఎలా జీవించాడో మనందరికీ తెలిసిందే.

ఉప్పెన చిత్రంలోనూ అలాంటి షేడ్స్ ఉన్న పాత్రగా విజయ్ సేతుపతి పాత్ర ఉంటుందని తెలుస్తోంది.

మొత్తానికి తన గురువు సుకుమార్ తెరకెక్కించిన చిత్రం నుండి విలన్ పాత్ర తరహాలోనే ఉప్పెనలో కూడా విలన్ పాత్ర ఉండేటట్లు చేస్తున్న బుచ్చిబాబు, ఈ సినిమాతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి.

ఇక వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు ఇప్పటికే పలు రికార్డులను క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఉప్పెన చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ప్రశ్న మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉండిపోయింది.

మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.

ఆమెతో నన్ను లింక్ చేసి మాట్లాడుతున్నారు.. బాధేస్తుంది.. శేఖర్ మాస్టర్ కామెంట్స్ వైరల్!

ఆమెతో నన్ను లింక్ చేసి మాట్లాడుతున్నారు.. బాధేస్తుంది.. శేఖర్ మాస్టర్ కామెంట్స్ వైరల్!