నాన్న చనిపోయినప్పుడు పుల్లలకు కూడా డబ్బుల్లేవు.. ఎమోషనల్ అయిన రంగస్థలం మహేష్!

జబర్దస్త్ షో రంగస్థలం( Rangasthalam ) మూవీ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న నటులలో రంగస్థలం మహేష్ ఒకరు.

ఈ నటుడు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నితిన్ గారి ఆఫీస్ లో ఫోటో ఇచ్చి అలా నడుచుకుంటూ వెళుతున్నానని ఆ సమయంలో నాన్నగారు చనిపోయారని కాల్ వచ్చిందని మహేష్( Mahesh ) చెప్పుకొచ్చారు.

అప్పుడు నా దగ్గర రూపాయి కూడా లేదని రంగస్థలం మహేష్ పేర్కొన్నారు. """/" / మా నాన్నను కాటి దగ్గరకు తీసుకెళ్లి అక్కడ తగలబెట్టడానికి పుల్లలకు 500 రూపాయలు నా దగ్గర లేవని రంగస్థలం మహేష్ చెప్పుకొచ్చారు.

తండ్రి గురించి చెబుతూ మహేష్ ఎమోషనల్ అయ్యారు.ఆ సమయంలో ఎందుకురా అని అనిపించిందని ఆయన తెలిపారు.

ఆ సమయంలో నాకు దగ్గరైన వాళ్లు కూడా నన్ను తిట్టారని రంగస్థలం మహేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

నన్ను ఎలా పిలిచినా నాకు ఓకే అని ఆయన వెల్లడించారు. """/" / మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు మనం జీరో అని ఇక్కడ ఎంత సక్సెస్ అయినా అది మన కెరీర్ కు ప్లస్ అవుతుందని మహేష్ చెప్పుకొచ్చారు.

నాగ్ అశ్విన్ గారు నాకు వాళ్ల బ్యానర్ లో ఉన్న ప్రతి సినిమాలో ఛాన్స్ ఇచ్చారని ఆయన తెలిపారు.

మనం న్యాచురల్ గా ఉండాలని ఆయన పేర్కొన్నారు.జీవితం సాఫీగా వెళుతుందని మహేష్ అన్నారు.

"""/" / పెద్దపెద్ద హడావిడి ఉండాలని నేను కోరుకున్నానని ఆయన తెలిపారు.విరూపాక్ష( Virupaksha ) సినిమా కోసం ఒకరోజు పని చేశానని మహేష్ వెల్లడించారు.

నాకు కారు పెద్దగా ఇష్టం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు.మహేష్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రంగస్థలం మహేష్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించడంతో పాటు మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఉసిరి గింజ‌లను పారేస్తున్నారా.. వాటి ప్ర‌యోజ‌నాలు తెలిస్తే షాకైపోతారు!