ప్రభాస్ కు బుజ్జిగాడు ఎలాగో నాకు ‘రంగబలి’ అలా.. నాగ శౌర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన నాగ శౌర్య( Naga Shaurya ) ఒక్కో సినిమాకు తన టాలెంట్ కనబరుస్తూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్నాడు.

నాగ శౌర్యకు 'ఛలో' సినిమా తర్వాత యూత్ లో మంచి ఫాలోయింగ్ పెరిగింది.

ఈయన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అయితే అందుకోలేక పోయాడు.

ఇక ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టాడు.నూతన డైరెక్టర్ పవన్ బాసంశెట్టి( Pawan Basamsetti ) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా ఫిక్స్ అవ్వగా ''రంగబలి''( Rangabali ) అనే టైటిల్ ను ఖరారు చేసారు.

ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి వారు నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాకు పవన్ సిహెచ్ సంగీతం అందిస్తుండగా.

దివాకర్ మణి కెమెరా మ్యాన్ గా పని చేస్తున్నారు. """/" / ఇదిలా ఉండగా ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేయగా ఈ సినిమాలో నాగ శౌర్య హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే పాత్రలో నాయిస్తుండగా ఈయన లుక్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అందాలు ఆకట్టుకోవడంతో రంగబలి సినిమాపై మంచి ఇంప్రెషన్ వచ్చింది.

ఈ టీజర్ లాంచ్ సందర్భంగా నాగ సౌర్య మీడియాతో మాట్లాడారు. """/" / ఈ సందర్భంగా ఈయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ కు బుజ్జిగాడు సినిమా( Bujjigadu Movie ) ఎంత ప్రత్యేకమో అందరికి తెలుసు.

ఈ సినిమాలో ఈయన సహజమైన బాడీ లాంగ్వేజ్, ప్రత్యేకమైన స్టైల్ అందరిని ఆకట్టుకుంది.

అదే విధంగా రంగబలిలో నా పాత్ర కూడా విభిన్నమైన బాడీ లాంగ్వేజ్ లో ఉంటుందని దీని కోసం టీమ్ అంతా ఎంతో కష్టపడ్డాం.

రిలీజ్ తర్వాత తప్పకుండ ఈ సినిమా ఆకట్టు కుంటుంది అనే నమ్మకం ఆయన వ్యక్తం చేసారు.