బలగం కంటే రంగ మార్తాండ కు ఏం తక్కువ… ఇక ఎందుకు ఈ సినిమా భారీ హిట్ అవ్వలేదంటే..?
TeluguStop.com
2023 లో వచ్చిన మంచి సినిమాలలో రంగమార్తాండ (Ranga Maarthaanda )ఒకటి.ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కినప్పటికి రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు.
ఇక ఈ సినిమా ఒక సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ హిట్ గా మిగలాల్సింది.
ఇక మొత్తానికైతే ఒక గొప్ప సినిమా గా నిలిచింది.కానీ కమర్షియల్ గా మాత్రం వెనకబడిపోయింది.
ఇక ఏది ఏమైనప్పటికి బ్రహ్మానందం, ప్రకాష్ రాజులు ఈ సినిమాలో చేసిన యాక్టింగ్ మాత్రం మనం ఇంతకు ముందు ఏ సినిమాలో చూడలేదు.
అలాంటి ఒక గొప్ప క్యారెక్టర్ లో నటించి మెప్పించారు.బ్రహ్మానందం,ప్రకాష్ రాజ్ ఇద్దరు వాళ్ల క్యారెక్టర్లలో జీవించారనే చెప్పాలి.
కృష్ణవంశీ(Krishna Vamsi ) దర్శకత్వం కూడా ఈ సినిమాకి చాలావరకు హెల్ప్ అయింది.
ఇక ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు అన్నీ ఒకేతైతే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మరొక ఎత్తు అనే చెప్పాలి.
"""/" /
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటుగా వేణు ఎల్డండి డైరెక్షన్ లో 2023 సంవత్సరం లోనే 'బలగం( Balagam ) ' అనే సినిమా కూడా రిలీజ్ అయింది.
ఇక ఇది తెలంగాణ ప్రాంతంలో ఒక ఫ్యామిలి లో ఉండే మనుషుల మధ్య గొడవలు ఎలా ఉంటాయి.
మనుషుల పుట్టుక, చావు ఎలా ఉంటుంది అనేది చూపించారు.ఇక ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్ కావడం విశేషం.
కాబట్టి ఈ సినిమాను బాగా హైప్ చేసుకొని సినిమా బాగా ఆడటానికి దిల్ రాజు చాలావరకు ప్రయత్నం చేశాడు.
ఇక 'బలగం ' సినిమా కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటుంది.దానికి సరైన ప్రమోషన్స్ ఉండటం అలాగే దిల్ రాజు తన పలుకుబడిని మొత్తం వాడుకొని ఈ సినిమా ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు.
కానీ 'రంగ మార్తాండ' సినిమాకి ప్రొడ్యూసర్ మధు కలిపి కాబట్టి ఈ సినిమా ఒక స్థాయి వరకు వచ్చి మాత్రమే ఆగిపోయింది.
మధు కలిపి గారు కూడా టాప్ ప్రొడ్యూసర్ అయి ఉంటే ఈ సినిమా మరొక లెవెల్లో ఉండేది.
ఇక మొత్తానికైతే ఆయన ఒక మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
"""/" /
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి రీసెంట్ గా రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు రావడం ఒక మంచి విషయం అనే చెప్పాలి.
ఇక ఉత్తమ నటుడిగా ప్రకాష్ రాజ్(
Prakash Raj ) నిలువగా, ఉత్తమ సహాయ నటుడిగా బ్రహ్మానందం(Brahmanandam ) కూడా ఈ అవార్డుని అందుకోవడం నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి.
నిజానికి మధు గారికి సినిమా మీద మంచి అభిరుచి ఉంది అందుకే కృష్ణవంశీ లాంటి స్టార్ డైరెక్టర్ తో ఇక మంచి కమర్షియల్ సినిమా చేయకుండా ఒక ఆర్ట్ ఫిల్మ్ చేశారు.
ఇక డబ్బులు బాగా వచ్చే ఒక సినిమా చేద్దాము అని ఆలోచించే ప్రొడ్యూసర్స్ ఉన్న ఈరోజుల్లో కూడా డబ్బులు కాదు మనకు సినిమా ముఖ్యం అని ఆలోచించే మధు గారి లాంటి పాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీ కావాలి.
ఇక ప్రస్తుతం 'రాజాశ్యామల ఎంటర్టైన్మెంట్స్' మీద 'మధు కలిపి' గారు సుమంత్ హీరోగా 'సంతోష్ జాగర్లపూడి' డైరెక్షన్ లో 'మహేంద్రగిరి వారాహి' అనే సినిమా చేస్తున్నారు.
ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది.
ఇక ఈ సినిమాతో అటు విమర్శకుల ప్రశంశలు అందుకుంటునే, ఒక భారీ కమర్షియల్ హిట్ కూడా కొట్టడానికి రెఢీ అవుతున్నారు.
ఢిల్లీలో పవర్ చూపించిన బాబు.. ఆ ప్రాజెక్టుకు కేంద్రం నిధుల విడుదల