ఆ విషయంలో చాలా ఇబ్బంది పెట్టాడంటున్న కాజల్

టాలీవుడ్ అందాల చందమామగా కాజల్ అగర్వాల్ టాప్ హీరోయిన్‌గా తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది.

ఈ భామ అందరూ స్టా్ర్ హీరోలతో పాటు యంగ్ హీరోలతోనూ రొమాన్స్ చేసి మెప్పించింది.

అయితే ఓ హీరోతో రొమాన్స్ చేయడం ఆమెను చాలా ఇబ్బంది పెట్టిందని స్వయంగా కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.

తెలుగులో ప్రసారమవుతున్న ఓ టీవీ షోను మంచు లక్ష్మీ హోస్ట్ చేస్తోన్న విషయం తెలిసిందే.

ఆ షోలో ఏ హీరోతో రొమాన్స్ చేయడం ఇబ్బందికరంగా ఫీలయ్యారు.? అంటూ మంచు లక్ష్మీ అడగ్గా.

బాలీవుడ్‌లో హీరో రణదీప్ హుడాతో కలిసి నటించిన దో లఫ్జోం కె కహానీ చిత్రంలో ఆమె పాత్ర అంధురాలు కావడంతో అతడి కళ్లలోకి చూస్తూ రొమాన్స్ చేయలేకపోయానంటూ చెప్పుకొచ్చింది.

రొమాన్స్‌ను పూర్తిగా పండించాలంటే ఒకరి కళ్లలోకి మరొకరు చూస్తేనే దాన్ని ఆస్వాదించగలం అంటూ చెప్పుకొచ్చింది.

ఏదేమైనా ఓపెన్‌గా మాట్లాడటమే తనకు ఇష్టమంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.ఇక కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కాల్ సెంటర్, ముంబయి సాగా, ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తోంది.

విశ్వం మూవీ ట్రైలర్ రివ్యూ.. డైరెక్టర్ శ్రీనువైట్ల ఖాతాలో బ్లాక్ బస్టర్ చేరినట్టేనా?