తెలుగు యాక్టర్స్ లో అతని ఫేవరెట్ ఎవరో చెప్పేసిన రణ్‌బీర్‌ కపూర్!

బాలీవుడ్‌ క్యూట్ కపుల్ రణ్‌బీర్‌ కపూర్‌,ఆలియా భట్‌ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర.

అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇకపోతే ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది.

పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ,కన్నడ,మలయాళ,భాషల్లో కూడా విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీకి కేవలం 100 రోజుల సమయం మిగిలి ఉంది.

దీనితో బ్రహ్మాస్త్ర చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు.ఈ క్రమంలోనే తాజాగా రణ్‌బీర్‌, దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో పర్యటించారు.

ఇక వారితో పాటు టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి కూడా ఆ ప్రమోషన్స్ లో కనిపించారు.

తాజాగా విశాఖపట్నంలో జరిగిన మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో రణ్‌బీర్‌ కు తెలుగు లో ఫేవరెట్ యాక్టర్ ఎవరు అన్న ప్రశ్న ఎదురయింది.

ఆ ప్రశ్నపై హీరో రణ్‌బీర్‌ స్పందిస్తూ ప్రభాస్ అంటూ సమాధానం ఇచ్చాడు. """/"/ తెలుగులో యాక్టర్స్ అందరూ గొప్పవారే.

కానీ అందులో ఒకరి పేరు చెప్పమంటే మాత్రం మై డార్లింగ్ ప్రభాస్ పేరు చెబుతాను.

ఎందుకంటే అతను నా బెస్ట్ ఫ్రెండ్, అంతే కాదు ప్రభాస్ అంటే అభిమానం కూడా అని చెప్పుకొచ్చాడు రణ్‌బీర్‌.

ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇకపోతే బ్రహ్మాస్త్ర  సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ తో పాటు బాలీవుడ్ బిగ్ బీ అయిన అమితాబ్ బచ్చన్,టాలీవుడ్ హీరో నాగార్జున, అలాగే మౌని రాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ సినిమాకు టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దక్షిణాది భాషలు అయినా తెలుగు తమిళం, కన్నడ,మలయాళ భాషల్లో విజన్ ను అందిస్తున్నాడు.

పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌ నుంచి దూకిన ప్రయాణికులు.. వేరే ట్రైన్ కింద నలిగిపోయి.. ఘోర వీడియో!