Ranbir Kapoor: కూతురు పేరు టాటూ వేయించుకున్న రణబీర్ కపూర్.. ఈ తండ్రి ప్రేమ గొప్పదంటూ?
TeluguStop.com
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్( Ranbir Kapoor ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు రణ్‌బీర్ కపూర్.
ఒకవైపు సినిమాలలో నటించడంతోపాటు మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ బాగానే సంపాదిస్తున్నారు.
ఇకపోతే ఆయన సినిమాల విషయానికి వస్తే.రణ్‌బీర్ కపూర్ తాజాగా నటించిన చిత్రం యానిమల్.
( Animal Movie ) ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన( Rashmika ) హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. """/" /
ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
కాగా సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా కోసం అటు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఇటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి( Sandeep Reddy ) హీరోయిన్ రష్మిక మందన్న లతో పాటుగా హీరో రణ్‌బీర్ కపూర్ లు నందమూరి నటసింహం బాలయ్య బాబు( Balakrishna ) హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోకు(
Unstoppable With NBK ) హాజరయ్యారు.
"""/" /
ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ఈ ఎపిసోడ్ ఫన్నీగా సాగడంతో ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే ఈ ఎపిసోడ్‌లోని ఒక సీన్‌లో టాటూల గురించి చర్చ రాగా రణ్‌బీర్ కపూర్ తన కుమార్తె రాహా( Raha ) పేరును టాటూగా వేయించుకున్నట్లు తెలిపాడు.
కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.
తండ్రి ప్రేమ గొప్పది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
No-Deposit Bonuses: Where To Get Free Spins — Insider Tips For High Rollers (CA)