నన్ను క్షమించండి..యానిమల్ లాంటి సినిమా మరోసారి చెయ్యను: రణబీర్ కపూర్
TeluguStop.com

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) ఒకరు.


ఈయన ఇటీవల యానిమల్ సినిమా( Animal Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.


సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ రష్మిక ( Rashmika ) హీరో హీరోయిన్లుగా నటించారు.
అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఈ సినిమా పట్ల చాలామంది విమర్శలు చేశారు.
"""/" /
ఇక ఈ సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత మరింతమంది విమర్శలు చేశారు.
అయితే తాజాగా ఈ సినిమా గురించి వచ్చిన విమర్శలపై ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
యానిమల్ సినిమా గురించి ఎన్నో విమర్శలు వచ్చాయి అయితే తాను ఆ విమర్శలను పట్టించుకోలేదని తెలిపారు.
ఈ సినిమా కథ విన్న తర్వాత ఎప్పుడు రొటీన్ గా కాకుండా చాలా డిఫరెంట్ గా అనిపించింది కానీ ఇలాంటి అడల్ట్ సినిమాలో నటించడానికి కాస్త భయపడ్డానని తెలిపారు.
"""/" /
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి విమర్శలు చేశారని తెలిపారు.
నువ్వు ఈ సినిమాలో నటించకుండా ఉండాల్సింది.నువ్వు యాక్ట్ చేయడం మమ్మల్ని బాధపెట్టిందని తెలిపారు.
ఇలా ఇండస్ట్రీకి చెందిన వారే ఇలాంటి విమర్శలు చేయడంతో క్షమించండి మరోసారి ఇలాంటి సినిమాలు చేయనని వారికి తెలిపాను.
నేను వారి అభిప్రాయాలతో ఏకీభవించనని తెలిపారు.ప్రస్తుతం వారితో గొడవలు పెట్టుకునే పరిస్థితులలో నేను లేనని తెలిపారు.
ఇక నా వర్క్ నచ్చలేదని చెబితే తదుపరి సినిమాకు కష్టపడి పనిచేస్తానని చెబుతాను అంటూ ఈ సందర్భంగా రణబీర్ కపూర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ న్యాచురల్ జెల్ తో మీ జుట్టు అవుతుంది డబుల్..!