ఖరీదైన కారు కొనుగోలు చేసిన స్టార్ కపుల్.. కారు ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే!
TeluguStop.com
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ( Ranbir Kapoor, Alia Bhatt )ల గురించి మనందరికీ తెలిసిందే.
బాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు.
చాలా సినిమాలలో కలిసి నటించిన ఈ జంట రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఒకటైన విషయం తెలిసిందే.
పెళ్లి అయినప్పటికీ అలియా ఏ మాత్రం తగ్గకుండా అదే ఊపుతో అదే క్రేజ్ తో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంది.
తాజాగా ఈ జంట అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు హాజరయ్యారు. """/" /
ఇటలీలో జరిగిన క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో( Cruise Pre-wedding Celebrations ) పాల్గొని తాజాగా ముంబయికి తిరిగివచ్చారు.
తమ ముద్దుల కూతురు రాహా కపూర్‌తో( Raha Kapoor ) కలిసి ఇండియా చేరుకున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ జంట కొత్త కారు కొన్నట్లు తెలుస్తోంది.
ఇటలీ నుంచి ముంబయికి వచ్చిన ఈ జంట తమ ఖరీదైన లగ్జరీ కారులో ఇంటికి చేరుకున్నారు.
దీంతో అందరి దృష్టి కారుమీదే పడింది.లెక్సస్ ఎల్‌ఎమ్ బ్రాండ్‌కు చెందిన ఈ కారు విలువ దాదాపు రూ.
5 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.ఇటీవల ఏప్రిల్ నెలలో బెంటెలీ బ్రాండ్ కారును ( Bentley Brand Car )రణ్‌బీర్ కొనుగోలు చేశాడు.
"""/" /
వీటితో పాటు రణ్‌బీర్ గ్యారేజీలో రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆడి, మెర్సిడెస్ కార్లు ఉన్నాయి.
అలియాకు సైతం రేంజ్ రోవర్, ఆడి ఏ6, బీఎండబ్ల్యూ, ఆడి క్యూ5, ఆడి క్యూ7 కార్లు కలిగి ఉన్నారు.
దీంతో తాజాగా మరో లగ్జరీ కారు వచ్చి చేరింది.ఇకపోతే రణ్‌బీర్ కపూర్ సినిమాల విషయానికి వస్తే.
గత ఏడాది అనిమల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు రణ్‌బీర్ కపూర్.ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కి తన ఖాతాలో వేసుకున్నారు.