మళ్లీ అలియాభట్ రణ్ బీర్ కలిసి నటిస్తారా.. సూపర్ క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!

బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌బీర్‌ కపూర్,అలియా భట్ ల జంట గురించి మనందరికీ తెలిసిందే.

ఇటీవల ఈ జంట వైవాహిక బంధంతో ఒకటయ్యారు.అంతేకాకుండా ఆలియా భట్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.

ఇక ఇది ఇలా ఉంటే ఈ జంట తాజాగా కలిసి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదనిపించింది.పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది.

పెళ్లయిన తర్వాత కూడా ఈ జంట కలిసిన నటించిన చిత్రం ఇదే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ జంటకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అదేమిటంటే అలియా భట్,రణ్‌బీర్‌ కపూర్ లు మరొక సినిమాలో కలిసిన నటిస్తున్నారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.

వీరిద్దరూ కలిసి మరొక రొమాంటిక్ కామెడీ సినిమాలు నటించబోతున్నట్లు వార్తలు వినిపించగా ఆ విషయంపై తాజాగా ఈ జంట స్పందించారు.

తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ జంట ఈ విషయం గురించి స్పందిస్తూ ఆ వార్తలకు చెక్ పెట్టేశారు.

ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌ కపూర్ మాట్లాడుతూ మా ఇద్దరి నిజ జీవితంలో సరదాగా ఉన్నాము.

"""/"/ ప్రస్తుతానికి మేమిద్దరం వేరే సినిమాలో నటించడం లేదు అని తెలిపారు రణ్‌బీర్‌.

అనంతరం అలియా భట్ కూడా మాట్లాడుతూ నేను రూమర్ల గురించి విన్నాను.కానీ మా తరువాత చిత్రం బ్రహ్మస్త్ర పార్ట్‌ -2 మాత్రమేనని తేల్చేసింది.

బ్రహ్మస్త్ర కాకుండా అయాన్ ముఖర్జీ ఇతర సినిమాల్లో నటించడానికి అనుమతి ఇస్తారో లేదో తెలియదు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

అయితే రణ్‌బీర్‌, అలియా కలిసి మరో సినిమాలో నటిస్తున్నారు అన్న వార్తను నిజమే కానీ అది బ్రహ్మాస్త్ర పార్ట్ 2 లో మాత్రమే ఇతర వేరే సినిమాలలో కాదు అని ఈ జంట స్పష్టతనిచ్చింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 18, ఆదివారం 2024