రణబీర్ వ్యాఖ్యలను మహేష్ సీరియస్ గా తీసుకుంటాడా?

బాలీవుడ్‌ లో రణబీర్ కపూర్‌( Ranbir Kapoor ) హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అయింది.

అక్కడ ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు, అక్కడ స్టార్‌ హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు.

కోట్లాది మంది అభిమానం సొంతం చేసుకున్నాడు.అయితే ఈ మధ్య కాలంలో తెలుగు మీడియాలో రణబీర్ కపూర్‌ గురించి జరుగుతున్నంత ప్రచారం గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు అనే విషయం తెల్సిందే.

బ్రహ్మాస్త్ర సినిమాను( Brahmastra ) తెలుగు లో కాస్త ఎక్కువగానే ప్రమోట్ చేశారు.

బిగ్‌ బాస్ మొదలుకుని చాలా షో ల్లో రణబీర్‌ కనిపించి తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు ప్రయత్నించాడు.

కానీ ఫలితం బెడిసి కొట్టింది. """/" / ఇప్పుడు యానిమల్‌ సినిమా తో( Animal Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.

హిందీ సినిమా నే అయినా కూడా యానిమల్‌ కి తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగ( Sandeep Vanga ) దర్శకత్వం వహించడం తో పాటు సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ నేషనల్‌ క్రష్ రష్మిక మందన్నా( Rashmika Mandanna ) హీరోయిన్‌ గా నటించడం వల్ల ఇక్కడ పాజిటివ్‌ బజ్ ను క్రియేట్‌ చేసింది అనడంలో సందేహం లేదు.

అందుకే ఆ బజ్ ను కలెక్షన్స్ గా మార్చుకునేందుకు రణబీర్‌ కపూర్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.

సౌత్ లో పెద్ద ఎత్తున ప్రమోషన్ చేస్తున్నాడు. """/" / అంతే కాకుండా సౌత్‌ సినిమా ల గురించి కూడా మాట్లాడుతున్నాడు.

తాజాగా రణబీర్ కపూర్‌ మాట్లాడుతూ తాను తెలుగు సినిమాల్లో నటించాల్సి వస్తే కచ్చితంగా మహేష్ బాబు తో ( Mahesh Babu ) స్క్రీన్ షేర్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తాను.

ఆయన అంటే ప్రత్యేకమైన అభిమానం అన్నట్లుగా రణబీర్‌ పేర్కొన్నాడు.ఈ వ్యాఖ్యలను మహేష్ బాబు సీరియస్ గా తీసుకుంటే కచ్చితంగా సందీప్ వంగ వంటి దర్శకులు వీరి కోసం మల్టీ స్టారర్‌ స్క్రీప్ట్‌ ను రెడీ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.