దగ్గుబాటి కుటుంబంలో విషాదం…. పాడే మోసిన హీరో రానా?
TeluguStop.com
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కుటుంబంలో దగ్గుబాటి కుటుంబం ఒకటి.
దగ్గుబాటి రామానాయుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ప్రస్తుతం సురేష్ బాబు ( Suresh Babu )నిర్మాతగా కొనసాగుతూ ఉండగా హీరోలుగా వెంకటేష్ రానా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
తాజాగా దగ్గుబాటి ఇంట్లో విషాదం చోటు చేసుకుందని తెలుస్తోంది.దగ్గుబాటి సురేష్ బాబు అత్తగారు అయినటువంటి రాజేశ్వరి దేవి ( Rajeswari Devi )అనారోగ్యంతో మరణించారు.
"""/" /
సురేష్ బాబు భార్య లక్ష్మి తల్లి కావడంతో సురేష్ బాబు కుటుంబ సభ్యులందరూ కూడా రాజేశ్వరి అంత్యక్రియలలో పాల్గొన్నారు.
సురేష్ బాబు భార్య లక్ష్మి కుటుంబ సభ్యులు రాజకీయాలలోనూ వ్యాపార రంగంలోనూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.
ఇక రాజేశ్వరి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండగా ఇటీవల కన్నుమూయడంతో ఈమె అంత్యక్రియలను తన సొంతూరు అయినటువంటి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించారు.
"""/" /
అంత్యక్రియలలో భాగంగా రానా( Rana ), రానా తల్లి లక్ష్మి అలాగే సురేష్ బాబు పాల్గొన్నారు ఇక మరణించింది స్వయాన తన అమ్మమ్మ కావడంతో రానా ఏకంగా తన అమ్మమ్మ పాడే మోసారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక రానా సినిమాల విషయానికొస్తే ఈయన ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.
అలాగే పలు సినిమాలకు నిర్మాతగా కూడా రానా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇలా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు పలు టాక్ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ రానా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
సీనియర్ హీరోల్లో వెంకటేష్ కి ముందు వరుసలో ఉండటానికి కారణం ఏంటి..?