హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ కెరియర్ ని సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయా....
TeluguStop.com
యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటించిన రణం చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన కన్నడ బ్యూటీ కామ్నా జఠ్మలానీ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.
అయితే తాజాగా కామ్నా జఠ్మలానీ తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈ టీవీ లో ప్రసారమయ్యే "ఆలీతో సరదాగా షో" లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.
కాగా తాజాగా షో నిర్వాహకులు వచ్చేవారం ప్రసారమయ్యే షో ప్రోమోని యూట్యూబ్లో విడుదల చేశారు.
అయితే ఈ షోలో కామ్నా జఠ్మలానీ వచ్చీరాని తెలుగుతో బాగానే సందడి చేసింది.
ఇందులో భాగంగా తనకి తెలుగులో 4, 5 హిట్లు వచ్చినప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల తన సినీ కెరీర్ ని సరిగ్గా ప్లాన్ చేసుకోలేక పోయానని తెలిపింది.
అలాగే తనకి ఓ పెద్ద చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందని అందుకు సంబంధించిన పారితోషికం డబ్బు కూడా అందిందని తెలిపింది.
కానీ ఆ భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియలేదు.అలాగే రణం చిత్రంలో అలీతో గడిపిన క్షణాలు గురించి కూడా గుర్తు చేసుకుంది.
కానీ చివరగా అలీ ఓ వీడియోని చూపించడంతో కొంతమేర కంటతడి పెడుతూ ఎమోషనల్ అయ్యింది.
దీంతో ఆ వివరాలు తెలియాలంటే వచ్చేవారం వరకు వేచి చూడాల్సిందే. """/"/
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఒకప్పుడు తెలుగులో అడపాదడపా చిత్రాల్లో హీరోయిన్ గా నటించి బాగానే రాణించిన కామ్నా జఠ్మలానీ బెంగుళూరు కి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
దీంతో అప్పటి నుంచి సినిమాలకు దూరమైంది.కాగా ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అయితే ఇటీవల కాలంలో కామ్నా జఠ్మలానీ మళ్లీ సినిమాల్లో హీరోయిన్ గా నటించడానికి ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో బరువు కూడా తగ్గి బాగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తోంది.
భార్య పుట్టినరోజు.. కేజీఎఫ్ హీరో యశ్ భార్యకు ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో తెలుసా?