రానా రెండు సినిమాల విషయంలో ఫుల్‌ క్లారిటీ

కరోనా కారణంగా ఆరు నెలల క్రితం మూతబడ్డ సినిమా హాలు ఇప్పటి వరకు తెరుచుకోలేదు.

కేంద్ర ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి అన్ లాక్ చేస్తూ వస్తున్నా థియేటర్ల విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఒక నిర్ణయానికి రాలేదు.

కరోనా వ్యాప్తికి థియేటర్లు కారణం అవుతాయనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేక పోతుంది.

అన్‌ లాక్‌ కు గత కొన్ని రోజులుగా థియేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వం వద్ద మొరపెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే నెల లేదా నవంబర్ నుండి థియేటర్ల ఓపెన్ కి అనుమతులు వచ్చే అవకాశం ఉంది.

థియేటర్ లు ఓపెన్ అయిన తర్వాత కూడా ప్రేక్షకులు వచ్చే విషయం ఫై అనుమానాలు నెలకొన్నాయి.

ఆ కారణంగానే ఇప్పటికే పూర్తయిన సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.

షూటింగ్ చివరి దశలో ఉన్న సినిమాలను కూడా పూర్తి చేసి ఓటీటీలో విడుదల చేయబోతున్నారు.

యంగ్‌ హీరో రానా నటిస్తున్న విరాటపర్వం సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు గా ఇటీవల వార్తలు వచ్చాయి.

ప్రముఖ ఓటీటీ వారు ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేసేందుకు ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ కు ఆఫర్ ఇచ్చారట.

కాని చిత్ర నిర్మాణ సంస్థ మాత్రం ఓటీటీ విడుదలకు ఆసక్తిగా లేనట్లుగా తెలుస్తోంది.

ఎన్ని నెలలు అయినా వెయిట్ చేసి థియేటర్లలో మాత్రమే ఈ సినిమాను విడుదల చేయాలని వారు భావిస్తున్నారు.

ఓటీటీలో విడుదల చేస్తే ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా థ్రిల్‌ కలిగించదని అందుకే థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలనుకున్నట్లుగా వారు చెబుతున్నారు.

రానా ఈ సినిమా లో నక్సలైట్ గా నటిస్తున్నట్లు గా సమాచారం అందుతోంది.

సాయి పల్లవి మరియు సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఇప్పటి వరకు 50 శాతం సినిమా షూటింగ్ పూర్తి అయింది.బ్యాలెన్స్ షూట్‌ ను నవంబర్ నుండి చేసే అవకాశం ఉంది.

రానా నటించిన అరణ్య సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.ఆ సినిమాను కూడా ఓటీటీ లో విడుదల చేసేందుకు మేకర్లు ఆసక్తిగా లేరు.

థియేటర్లు ఓపెన్ అయిన సమయంలోనే ఆ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు.

మొత్తానికి రానా రెండు సినిమాలు కూడా ఓటీటీలో విడుదల కావడం లేదని క్లారిటీ వచ్చేసింది.

అప్పుడే శ్రీలీలా ఫెమ్ పడిపోయిందా? ఐటమ్ సాంగ్ స్టేజ్ కి వచ్చేసిందే!