దేవర లో ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో స్టార్ హీరో…

జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ( Koratala Siva ) డైరెక్షన్ లో వస్తున్న దేవర సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి.

నిజానికి ఈ సినిమా కొరటాల శివ అల్లు అర్జున్ తో చేయాలి కానీ అల్లు అర్జున్ సుకుమార్ దగ్గర పుష్ప రెండు పార్టీల కోసం ఫిక్స్ అవ్వడంతో డేట్స్ కుదరక ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు ఇక దాంతో ఆ స్టోరీ ఎన్టీయార్ దగ్గరికి వచ్చింది అనే విషయం అందరికి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ లో ఎన్టీయార్ లుక్స్ చాలా సూపర్ గా ఉన్నాయి.

"""/" / అయితే ఈ సినిమా మీద రోజు రోజు కి అంచనాలు పెరిగిపోతుంటే ఈ మూవీ నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ కూడా సినిమా మీద అంచనాలను పెంచుతున్నాయి.

ఇక రీసెంట్ గా ఈ సినిమాలో ఉన్న ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం రానా( Rana ) ని తీసుకున్నట్టు గా తెలుస్తుంది.

అయితే ఈ క్యారెక్టర్ ఏంటి అనేది ఎవరికి తెలియడం లేదు.కానీ ఈ సినిమాలో రానా మాత్రం చేస్తున్నాడు అంటూ ఇప్పటికీ చాలా వార్తలు వస్తున్నాయి.

"""/" / అయితే ఈ సినిమాలో రానా తో పాటు రానా కి జోడీగా మరో హీరోయిన్ కూడా నటిస్తుంది అంటా.

రానా క్యారెక్టర్ ఒక 15 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తుంది.కానీ ఇది సినిమా మొత్తాన్ని మలుపు తిప్పే క్యారెక్టర్ అని కూడా తెలుస్తుంది.

ఇక ఈ న్యూస్ విన్న తర్వాత ఈ మధ్య రానా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేస్తూ మంచి గుర్తింపు పొందుతున్నాడు.

ముఖ్యంగా తాను హీరోగానే చెయ్యాలి అనే కాన్సెప్ట్ పెట్టుకోకుండా మంచి క్యారెక్టర్లు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

Sports Betting Odds & Protecting Minors: A Down-Under Look For Aussie Crypto Punters