షూటింగ్ పూర్తి చేసుకున్న రానా నాయుడు.. త్వరలోనే ట్రైలర్ లాంచ్!

టాలీవుడ్ సీనియర్ నటుడు దగ్గుబాటి వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆయన నటించిన ఎఫ్ 3 సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ఇప్పటికే వరుణ్ తేజ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి ఎంతోమంది హీరోలతో మల్టీస్టారర్ చిత్రాల్లో నటించిన వెంకటేష్ తన వరుసకి కొడుకు అయ్యే రానాతో కూడా కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించారు.

నెట్ ఫ్లిక్స్ కోసం అబ్బాయ్, బాబాయ్ ఇద్దరు అమెరికన్ క్రైమ్ డ్రామా సీరిస్ ‘రే డోనోవన్’ ఆధారంగా రూపుదిద్దుకుంటోంది ‘రానా నాయుడు’అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇందులో రానా వెంకటేష్ కొడుకు పాత్రలో నటిస్తూ ఇల్లీగల్ కార్యక్రమాలు చేసే పాత్రలో నటించగా, వెంకటేష్ తనకు తండ్రిగా జైలులో ఉండి తన కొడుకు కోసం అన్ని కార్యక్రమాలను సెట్ చేసే ఒక గ్యాంగ్ స్టర్ పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు.

"""/" / ఇలా తండ్రీకొడుకులుగా వీరిద్దరూ మొట్టమొదటిసారిగా స్క్రీన్ షేర్ చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదలకు సిద్ధమవుతుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ లాంచ్ చేయనున్నారు.ఇకపోతే ఈ వెబ్ సిరీస్ కరన్ అన్షుమాన్ దర్శకత్వంలో తెరకెక్కింది.

ఇటలీకి నెలరోజుల ట్రిప్పు.. ఆఫీస్ బాస్‌ను పిచ్చోడ్ని చేశాడు..??