అంగరంగ వైభవంగా రానా మిహికాల వివాహం
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ రానా వివాహం అతి తక్కువ మంది గెస్ట్‌ల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు పెద్దగా బంధు మిత్రులను ఆహ్వానించలేదు.అతి తక్కువ మంది మాత్రమే ఈ వివాహ వేడుకలో హాజరు అయ్యారు.
టాలీవుడ్ నుండి అల్లు అర్జున్ ఈ వివాహ వేడుకలో పాల్గొన్నాడు.ఇక రానా ఫ్యామిలీ మెంబర్ అయిన నాగచైతన్య సతీ సమంత సమేతంగా హాజరు అయ్యాడు.
ఈ వివాహ వేడుకలో ప్రభాస్ పాల్గొన్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.అల్లు అర్జున్ హాజరు అయినట్లుగా ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
రానా గోధుమ వర్ణంలో లాల్చీ పంచె ధరించగా మిహికా బజాజ్ కూడా అదే రంగు డిజైన్డ్ సారీ ధరించారు.
ఇద్దరు కూడా అత్యంత ఖరీదైన వస్త్రాలను ధరించడంతో పాటు అత్యంత ఖరీదైన పెళ్లి వేదికపై వివాహం చేసుకున్నట్లుగా బయటకు వచ్చిన ఫొటోలను బట్టి అర్థం అవుతుంది.
కుటుంబ సభ్యులు మరియు అతి తక్కువ మంది బంధు మిత్రుల సమక్షంలో సామాజిక దూరం పాటిస్తూ రానా వివాహం వైభవంగా జరిగింది.
"""/"/
ఇన్నాళ్లు టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా పేరున్న రానా ఇప్పుడు ఒక ఇంటి వాడు అయ్యాడు.
ఈ సందర్బంగా నవదీప్ స్పందిస్తూ నీ జాలీ లైఫ్ కు ఇదే ఆకరి రోజు అంటూ కామెంట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
సరదాగా ఆయన ఆ కామెంట్ చేసి పెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు.మా తరపున కూడా రానా మిహికా బజాజ్ లకు హృదయపూర్వక వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.
షాకింగ్: అడుక్కునే వ్యక్తి చేతిలో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్.. ఎలా కొన్నాడో వినండి?