అలాంటి పాత్రలో శివగామి..?

బాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు.అందులో స్టార్ హీరోలు లేకపోయినా ఆ సినిమా కథనే హీరోగా మారి సక్సెస్ అందుకున్నాయి.

ఇటీవల వచ్చిన అంధాధున్ సినిమా అక్కడ ఎలాంటి సక్సెస్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా యాక్టింగ్‌కు బాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు.ఇక ఈ సినిమా సాధించిన సక్సెస్‌తో దీన్ని ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాలో హీరోగా యంగ్ హీరో నితిన్‌ను ఓకే చేశారు చిత్ర యూనిట్.

అయితే అంధాధున్ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా యాక్టింగ్‌తో పాటు నెగెటివ్‌తో పాటు బోల్డ్ రోల్ చేసిన టబుకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ముఖ్యంగా బోల్డ్ సీన్స్‌లో ఆమె నటనకు ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు.దీంతో ఇప్పుడు తెలుగులో ఈ పాత్రను ఎవరితో చేయించాలా అనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారు.

తొలుత ఈ పాత్రను హాట్ యాంకర్ అనసూయతో చేయించాలని అనుకున్నారు.కానీ ఇప్పుడు ఆ పాత్రను రమ్యకృష్ణతో చేయించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

దీంతో వారు ఆమెను సంప్రదించడం కూడా జరిగిందట.అయితే ఇలాంటి బోల్డ్ పాత్రలో ఆమె నటిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

జూనియర్ ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!!