రమ్యకృష్ణ నిజంగా గ్రేట్.. ఓకే నటుడి సరసన కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించింది?

సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్లకు పాపులారిటీ చాలా తక్కువ అంటూ ఉంటారు.ఎంత పాపులారిటీ ఉన్న అది కొంతకాలమే అని ఒక భావన కూడా ఉంది.

ఎందుకంటే ఒక హీరోయిన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దశాబ్ద కాలం దాటి పోయింది అంటే ఒక హీరోయిన్గా అవకాశాలు రావడం చాలా తక్కువ.

సీనియర్ హీరోయిన్ అంటూ ముద్ర వేస్తూ ఉంటారు.హీరోలకు 60 ఏళ్లు వచ్చినా పట్టించుకోని దర్శకులు హీరోయిన్లు 30 ఏళ్లు దాటి పోయాయి అంటే చాలు వాళ్ళని సినిమా లో పెట్టుకోవాలి అంటే ఆలోచిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే హీరో సరసన హీరోయిన్ గా నటించిన వారు ఆ తరువాత కాలంలో అదే హీరో సినిమాలో అమ్మ అక్క పాత్రలు చేయడం చేస్తూ ఉంటారు.

అయితే ఎంతో మంది హీరోయిన్లు హీరోల సరసన నటించి ఆ తర్వాత అదే హీరో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం ఇప్పటి వరకు చూశాము.

కానీ ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం అరుదైన రికార్డు ను సంపాదించుకుంది.ఏకంగా ఒక నటుడి సరసన కూతురిగా భార్యగా చెల్లిగా కూడా నటించింది.

ఆ నటి ఎవరో కాదు రమ్యకృష్ణ.సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న రమ్యకృష్ణ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది.

ఇక ఒకప్పుడు నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రలో మెప్పించింది.ఇక మొన్నటికి మొన్న బాహుబలి సినిమాలో శివగామి పాత్ర తో తన పవర్ఫుల్ నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది.

"""/"/ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది.

అయితే రమ్య కృష్ణ ఒక నటుడి సరసన కూతురిగా చెల్లెలిగా భార్యగా కూడా నటించిందట.

ఆ నటుడు ఎవరో కాదు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాజర్.రజనీకాంత్ హీరోగా నటించిన నరసింహ సినిమా లో నీలాంబరి పాత్రలో నటించింది రమ్యకృష్ణ.

ఇదే సినిమాలో నీలాంబరి అన్నయ్య పాత్రలో నటించాడు నాజర్.ఇక తమిళంలో సూపర్హిట్ అయిన సినిమా వంత రాజవుతాన్ వరువెను సినిమాలో నాజర్ కూతురుగా కనిపించింది రమ్యకృష్ణ.

బాహుబలి సినిమాలో నాజర్ భార్య గా కనిపించిన విషయం తెలిసిందే.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?