రమ్య రఘుపతి విడాకులు తీసుకుంటే నరేష్ అన్ని రూ.కోట్లు ఇస్తానన్నారా?
TeluguStop.com
రమ్య రఘుపతి నరేష్ మధ్య గొడవలకు సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి.
రమ్య రఘుపతి విడాకులు ఇవ్వాలని నరేష్ కోరుకుంటున్నా ఆమె మాత్రం అందుకు అంగీకరించడం లేదు.
అయితే నరేష్ మూడు కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేశాడని ఆమె అన్నారు.
అయితే డబ్బు నాకు ముఖ్యం కాదని అందుకే ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశానని రమ్య రఘుపతి చెప్పుకొచ్చారు.
అయితే నరేష్ రమ్య రఘుపతి సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ వివాదాన్ని పెద్దది చేయడం వల్ల ఇరు కుటుంబాల పరువు పోతుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియాలో అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు నరేష్, పవిత్ర లోకేశ్ వరుసగా సినిమాలలో కలిసి నటిస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.
"""/"/
ప్రస్తుతం వీళ్లిద్దరూ కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు.
అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుందో లేక ఓటీటీలో విడుదలవుతుందో చూడాల్సి ఉంది.
రమ్య రఘుపతి కొడుకు కోరిక మేరకు నరేష్ కు విడాకులు ఇవ్వడానికి అంగీకరించడం లేదని సమాచారం అందుతోంది.
రమ్య రఘుపతి నరేష్ ల సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుందో చూడాల్సి ఉంది.
"""/"/
విడాకుల సమస్య పరిష్కారం అయితే నరేష్ పవిత్ర లోకేశ్ పెళ్లి చేసుకునే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది.
నరేష్ పవిత్ర లోకేశ్ జోడీ గురించి కొంతమంది పాజిటివ్ కామెంట్లు చేస్తుండగా ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు నరేష్ కు సినిమా ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నరేష్ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తూ సత్తా చాటుతున్నారు.