మళ్లీ పెళ్లి సినిమాకు షాక్ ఇచ్చిన రమ్య రఘుపతి… విడుదల ఆపాలంటూ

సీనియర్ నటుడు నరేష్ (Naresh) పవిత్ర లోకేష్ (Pavitra Lokesh) జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మళ్లీ పెళ్లి(Malli Pelli).

ఈ చిత్రాన్ని నరేష్ విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై స్వయంగా నిర్మించారు.

ఈ సినిమాకు నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు.ఈ సినిమా నరేష్ వ్యక్తిగత జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారని ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.

ఈ సినిమాలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి(Ramya Raghupathi) పాత్ర కూడా ఉండబోతుందని ఈ పాత్రలో నటి వనిత విజయ్ కుమార్ (Vanitha Vijay Kumar)నటించబోతున్నారు అనే విషయం కూడా మనకు తెలిసిందే.

ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

అయితే సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు సినిమా విడుదల ఆపాలి అంటూ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

ఇలా ఈమె కోర్టును ఆశ్రయించడంతో ఒక్కసారిగా చిత్ర బృందానికి షాక్ తగిలిందనే చెప్పాలి.

"""/" / ఇన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండగా ఒకరోజు విడుదలకు ముందు రమ్య రఘుపతి ఇలా సినిమా విడుదల చేయకూడదని, సినిమా విడుదల ఆపివేయాలి అంటూ కోర్టుమెట్లు ఎక్కడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఈ సినిమాలో తన ప్రతిష్టను కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారని ఈమె ఆరోపణలు చేస్తూ ఈ సినిమా విడుదల ఆపివేయాలని కోర్టును కోరారు.

మరి రమ్య రఘుపతి ఫిర్యాదు పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

లాంగ్ అండ్ స్మూత్ హెయిర్ కోసం ఈ ఫ్రూట్ మాస్క్ ను తప్పక ట్రై చేయండి!