Ramya Krishna : అప్పుడు నేనేమీ గొప్ప నటిని కాదు.. రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ విలన్ గా, హీరోయిన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ ( Ramya Krishna )గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదని చెప్పాలి.

అప్పట్లోనే తన అందాలతో చూపులు తిప్పుకోకుండా చేసింది.కేరీర్ మొదట్లో ఐరన్ లెగ్ అని ముద్ర వేసుకున్న రమ్యకృష్ణ ఆ మాటలనే ఆయుధంగా మార్చుకొని ఆ తర్వాత తనేంటో నిరూపించుకుంది.

ఈమె భలే మిత్రులు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకుపరిచయం కాగా ఆ తర్వాత తనకు బాగా విమర్శలు ఎదురయ్యాయి.

ఎప్పుడైతే స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు( K.Raghavendra Rao ) చేతిలో పడిందో అప్పటినుంచి తన తలరాత మొత్తం మారిపోయింది.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో తన సత్తా చూపించింది.

"""/" / ఇక వయసు మీద పడుతున్న కొద్ది సహాయక పాత్రలో చేసింది.

ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది రమ్యకృష్ణ.అయితే తాజాగా విడుదలైన జైలర్ సినిమా( Jailer Movie )లో రజినీకాంత్ సరసన నటించింది.

ఇక ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో సక్సెస్ లో భాగంగా తాజాగా తను ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.

అందులో చాలా విషయాలు పంచుకుంది. """/" / కెరీర్ ప్రారంభంలో తనేమి గొప్ప నటిని కాదంటూ.

1986లో తను నటించిన 'మొదల్ వసంతం' అనే తమిళ సినిమా చూశాక.తన తల్లి తనతో.

నువ్వు ఇంతకాలం నటిగా ఎలా కొనసాగవని నేరుగా అడిగేసిందట.ఎందుకంటే ఆ సినిమాలో తన పాత్రకు ఏ మాత్రం గుర్తింపు రాలేదని.

ఆ సినిమాలో గొప్ప నటులు ఉన్న కూడా తనకు ఆ సినిమా వల్ల ఉపయోగం లేదని చెప్పుకొచ్చింది.

ఇక తను నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని అందుకున్నాయని.

దాంతో తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది.

ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.

రాజమౌళి మహేష్ బాబు సినిమా మొదటి షెడ్యూల్ జరిగేది అక్కడేనా..?