స్టార్ కథానాయిక, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో రెండు సినిమాలు, ఒక వెబ్ సిరిస్ తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే.
ఈ మూడింటిలో నిత్యా మీనన్, కంగనా రనౌట్ సినిమాలలో జయలలిత పాత్రలు చేస్తూ ఉండగా వెబ్ సిరీస్ లో రమ్యకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తుంది.
ఇక క్వీన్ టైటిల్ తో గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రసాద్ మురుగేశన్ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతుంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన క్వీన్ ఫస్ట్ లుక్, టీజర్‌లు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.
గౌతమ్ మీనన్ సినిమాల స్టైల్ లోనే చాలా ప్లెజెంట్ గా క్వీన్ టీజర్ కనిపించింది.
తాజాగా క్వీన్ ట్రైలర్‌ను విడుదల చేశారు.రెండు నిమిషాలకి పైగా ఉన్న ఈ ట్రైలర్ లో జయలలిత చిన్న వయసు నుంచి రాజకీయ ప్రస్తానం వరకు చూపించారు.
ఇందులో చిన్న వయసులో జయలలితగా ఒకరు, హీరోయిన్ గా మారిన జయ పాత్రలో ఒకరు, రాజకీయ ప్రస్తానంలో జయలలితగా రమ్యకృష్ణ నటించారు.
ఇక ఈ ట్రైలర్ కూడా తమిళ రాజకీయాలలో కనిపించే మాస్ కనిపించకుండా, గౌతమ్ మీనన్ పూర్తిగా తనకి అలవాటైన ప్లెజెంట్ కథనంతో, జయలలిత జీవితాన్ని ఆవిష్కరించారని చెప్పాలి.
డిసెంబర్ 14న ఈ వెబ్ సిరీస్ ఏంఎక్స్ ప్ల్రేయర్ లో ప్రేక్షకుల ముందుకి రానున్న నేపధ్యంలో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మరి దానికి తగ్గట్లు, జయలలిత ఫ్యాన్స్ కి తగ్గ విధంగా ఈ వెబ్ సిరీస్ ఉంటుందో లేదో వేచి చూడాలి.