'మా' ఎన్నికల హడావుడిలో రాములమ్మ.. ఆమెకు సభ్యత్వమే లేదు

‘మా’ ఎన్నికల హడావుడిలో రాములమ్మ ఆమెకు సభ్యత్వమే లేదు

తెలుగు మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.మొదట ప్రకాష్‌ రాజ్ వర్సెస్‌ మంచు విష్ణు అనుకున్నారు.

‘మా’ ఎన్నికల హడావుడిలో రాములమ్మ ఆమెకు సభ్యత్వమే లేదు

కాని ఈ పోటీలో జీవిత రాజశేఖర్‌ మరియు హేమలు వచ్చి చేరారు.ఈ నలుగురితో పాటు తెలంగాణ వాదం మరియు కింది స్థాయి ఆర్టిస్టులకు అన్యాయం జరుగుతుంది అంటూ సీనియర్‌ నటుడు సీవీయల్‌ నరసింహా రావు కూడా బరిలోకి దిగుతున్నాడు.

‘మా’ ఎన్నికల హడావుడిలో రాములమ్మ ఆమెకు సభ్యత్వమే లేదు

తెలంగాణ సినీ కార్మికులకు తాను అండగా ఉంటాను అంటూ ఆయన చేసిన ప్రకటన ప్రాంతీయ వాదంకు తెర తీసినట్లయ్యింది.

సీవీయల్‌ నరసింహా రావు కు మద్దతుగా ఎవరు నిలుస్తారు అని అంతా భావించారు.

కాని ఆయన వెనుక పెద్ద తల విజయశాంతి నిలిచారు.ఆమె తన పూర్తి మద్దతును ఆయనకు ఇస్తున్నట్లుగా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు.

ఆయన ఆవేదన లో అర్థం ఉంది అంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆయనకు విజయశాంతి మద్దతు తో ఖచ్చితంగా కొంత మొత్తం లో అయినా ఓట్లను ఆయన చీల్చే అవకాశం ఉందంటున్నారు.

మా'' ఎన్నికల పై సీవీయల్ నరసింహా రావు అవేదన న్యాయమైనది, ధర్మమైంది నేను మా సభ్యురాలినీ కాకపోయినా ఒక కళాకారిణి గా స్పందిస్తున్న చిన్న కళాకారుల సంక్షేమం దృష్టా సీవీయల్ అభిప్రాయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్న అంటూ విజయశాంతి సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారు.

ఆమె తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు అభినందనలు తెలియజేస్తున్నారు.మా లో సభ్యత్వం లేకపోయినా కూడా విజయశాంతి ఈ ఎన్నికల గురించి స్పందించడం కొందరు అతి అంటున్నారు.

"""/"/ తెలంగాణ పదం వినిపించిన వెంటనే ఆమె కు మా ఎన్నికలు గుర్తుకు వచ్చాయా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

మా లో సభ్యురాలు కాని ఆమెకు అసలు ఎన్నికల గురించి మాట్లాడే హక్కు ఉందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సీనియర్‌ హీరోయిన్‌ అయిన విజయశాంతి కి ఎందుకు సభ్యత్వం లేదు అంటే ఆమె తన సభ్యత్వంను రినివల్‌ చేసుకోలేదు.

అందుకే ఆమెకు సభ్యత్వం లేదు.అయినా కూడా ఆమె టాలీవుడ్‌ పై ప్రత్యేక శ్రద్దను తీసుకుంటుందని అంటున్నారు.

మేమేం టెర్రరిస్టులం కాదు దయచేసి అలా చేయొద్దు… సీరియస్ అయిన నాని!