ఆంజనేయుడికి రాముడు ఇచ్చిన వరం ఏమిటో తెలుసా?

రామాయణంలో ఆంజనేయుడు పాత్ర ఎంత ఉందో మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

సీతారాములు అరణ్యవాసం చేస్తున్న సమయంలో రావణాసురుడు సీతను అపహరించగా సీత జాడను వెతకడంలో ఆంజనేయుడు పాత్ర ఎంతో కీలకమైనది.

ఈ విధంగా రావణాసురుని సంహరించిన సీతమ్మని తీసుకొని తిరిగి అయోధ్యకు పయనమయ్యే సమయంలో వానర సైన్యం హనుమంతుడు అయోధ్యకు చేరుకుంటారు.

అయోధ్యకు శ్రీరాముడు చేరిన తరువాత అక్కడ శ్రీరాముడికి ఎంతో ఘనంగా పట్టాభిషేకం జరిపిస్తారు.

శ్రీ రాముడి పట్టాభిషేకం ఎంతో కన్నుల పండుగగా జరిగింది.శ్రీరామ పట్టాభిషేకం అనంతరం అయోధ్యకు చేరుకున్న వారందరు ఒక్కొక్కరుగా అయోధ్య నుంచి వెళ్లిపోవడం జరిగింది.

రాముడు వారి పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి వారందరిని సాగనంపారు.రాముడి వెంట వచ్చిన వానరులు రాక్షసులు రెండు నెలల పాటు అయోధ్యలో గడిపి అయోధ్య నుంచి తిరిగి పయనమయ్యారు.

ఈ విధంగా వానరులలో చివరి వంతు హనుమంతుడికి వచ్చింది.అయోధ్య నుంచి వెళ్ళిపోతున్న సందర్భంగా హనుమంతుడు రాముని ఈ విధంగా కోరాడు.

"""/" / ప్రభూ! నా వినతి మన్నించు.నిత్యం నీ భక్తుడిగా ఉంటూ నిన్ను కొలుచుకునేలా నన్ను ఆశీర్వదించు.

ఇలపై రామకథా పారాయణం కొనసాగుతున్నంత వరకు నేను జీవించి ఉండేలా ఆశీర్వదించు అని కోరాడు.

హనుమంతుడు ఈ విధంగా కోరగానే రాముడు ఆంజనేయుని దగ్గరకు చేర్చుకుని హనుమా! ప్రజలు మా గాథను పారాయణం చేస్తున్నంత కాలం నీ కీర్తి దశదిశలా వ్యాప్తిస్తుండుగాక ఈ సృష్టి, ప్రపంచం ఉన్నంత వరకు నువ్వు చిరంజీవిగా వర్ధిల్లు అని రాముడు వరమిచ్చాడు.

తనను విడిచి హనుమంతుడు వెళ్ళటానికి ఇష్టంలేక బాధపడుతున్న సమయంలో తన దగ్గరే ఉండిపో అని రాముడు అనగా అందుకు హనుమంతుడు ఎంతో సంతోషంతో అయోధ్యలో ఉండిపోయాడు.

ఏపీలో వైసీపీ ప్రభంజనం ఖాయం.. తేల్చేసిన టీడీపీ