కన్నుల పండువగా రాములోరి కళ్యాణం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో శ్రీ సీతా రామచంద్ర స్వామి రాములోరి కళ్యాణం గురువారం కన్నుల పండువగా జరిగింది.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సదనం తో పాటు శ్రీ సాయి బాబా దేవాలయంలో , సద్ది మద్దుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం లో శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం కమనీయంగా రమణీయం గా జరిగింది.

శ్రీ రామ నవమి సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నగుబోతు లక్ష్మి నారాయణ గుప్తా కీర్తి శేషులు సుజాత విష్ణు ప్రసాద్ గుప్తా స్వేత దంపతులు శ్రీ సీతారామచంద్ర స్వామి లక్ష్మనా , శ్రీ ఆంజనేయస్వామి ఉత్సహా విగ్రహాలను ఇత్తడితో తయారు చేయించి సత్సంగ సదనం నకు సమకూర్చాగా సత్సంగ సధనంలో హిందు సంప్రదాయం ప్రకారం శ్రీ సీతారామ చంద్ర స్వామి కి గ్రామ పురోహితులు రాచర్ల దాయానంద్ శర్మ సత్సంగ సదనం అధ్యక్షులు బ్రాహ్మచారి లక్ష్మారెడ్డి, నగుబోతు విష్ణు ప్రసాద్ గుప్తా, స్వేత దంపతులతో ముత్యాల తలంబ్రాలు పట్టువస్త్రాలు సమర్పించి కళ్యాణం మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు.

అనంతరం అభిషేకం చేశారు.ఈ కళ్యాణ మహోత్సవం లో సత్సంగ సదనం కమిటీ సభ్యులు గంప నాగేంద్రం గుప్తా, విఠోబా , రామ్ రెడ్డి , సంజీవరెడ్డి, అనంతరెడ్డి , రేవూరి లక్ష్మి నారాయణ గుప్తా , నగుబోతు లక్ష్మీనారాయణ గుప్తా,నగుబోతు రాము గుప్తా, బోయిని నారాయణ , గ్రామస్తులు బండారి బాల్ రెడ్డి,పారిపెళ్ళి సంజీవరెడ్డి, నంది కిషన్, మెగి నర్సయ్య , ముత్యాల వెంకట్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాంపెల్లి అంభదాస్ ,చెట్కూరి కృష్ణ మూర్తి గౌడ్ , గంట వెంకటేష్ గౌడ్, సుంకి భాస్కర్ , ఇందల్ నాయక్ , గోదాగోష్టీ మహిళా భక్తులు రాచర్ల రాణి , ఉదయమ్మ చంద్రకళ, రేవూరి రామలక్ష్మి, పద్మ శ్యామ మంజుల , మేగి బిందు , నంది ఉమా , బొమ్మగంటి రమ్య బాద మాధవి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఈ కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న భక్త కోటికి తీర్థ ప్రసాదాలు పులిహోర ప్రసాదం వితరణ చేశారు , అనంతరం భక్తి కోటీకి భోజనాలు ఏర్పాటు చేశారు.

శ్రీ సాయి బాబా దేవాలయంలో ఆలయకమీటీ ఆద్వర్యంలో పెళ్ళి పందిరి వేయించి శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణం ఏంతో వైభవంగా జరిపించారు , రావుల భార్గవ్ రెడ్డి ఝాన్సీ దంపతులు పాల్గొన్నారు.

ఆలయ ప్రధాన అర్చకులు గుండయ్య శర్మ, ధర్మపురి కి చెందిన శ్రీ కాంత్ శర్మ స్వామి లోరికి కళ్యాణం జరిపించారు.

సద్ది మద్దుల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం లో శ్రీ సీతారామచంద్ర స్వామిలోరి కళ్యాణం గౌతమ్ ఘణంగా నిర్వహించారు.

ఆ డబ్బుతో నా జీవితమే మారిపోయింది..రకుల్ కామెంట్స్ వైరల్!