కానీ, న్యాచురల్‌గా కూడా పిగ్నెంటేషన్ సమస్యకు చెక్ పెట్ట వచ్చు.ముఖ్యంగా రామాఫలం పిగ్నెంటేషన్ సమస్యను నివారించడంలో గ్రేట్‌గా సమాయపడుతుంది.
చాలా అరుదుగా లభించే ఈ పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి అందరికీ తెలుసు.
అయితే సౌందర్య పరంగానూ రామాఫలం ఉపయోగపడుతుంది.ముఖ్యంగా పిగ్నెంటేషన్ సమస్యతో బాధ పడే వారు.
రామాఫలం తీసుకుని అందులో ఉండే గుజ్జు తీసుకోవాలి.ఆ గుజ్జులో కొద్దిగా పాటు పోసి బాగా మిక్స్ చేసి.
ముఖానికి అప్లై చేయాలి.ఇరవై నిమిషాల పాటు డ్రై అయిన తర్వాత గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా వారంలో మూడు లేదా నాలుగు సార్లు చేస్తూ ఉంటే.క్రమంగా పిగ్నెంటేషన్ సమస్య దూరం అవుతుంది.
ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.అలాగే మొటిమల సమస్యను నివారించడంలోనూ రామా ఫలం యూజ్ అవుతుంది.
రామా ఫలం నుంచి గుజ్జు తీసుకుని.అందులో తేనె వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.పావు గంట పాటు వదిలేయాలి.
అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా తరచూ చేస్తే రామాఫలంలో ఉండే విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి ముఖంపై ఏర్పడిన మొటిమలను తగ్గు ముఖం పట్టేలా చేస్తాయి.