రేపు ఉదయం ఫిల్మ్ సిటీలో రామోజీరావు అంత్యక్రియలు

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు( Ramoji Rao ) కన్నుమూసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఆయన అంత్యక్రియలు రేపు ఉదయం నిర్వహించనున్నారు.ఈ మేరకు రేపు ఉదయం 9 గంటలకు అధికారిక లాంఛనాలతో ఫిల్మ్ సిటీలో( Film City ) రామోజీరావు పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే రామోజీరావు అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఫిల్మ్ సిటీలో ఉన్న రామోజీరావు పార్థీవదేహాన్ని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.

బన్నీ నువ్వు నా బంగారం.. వివాదంపై స్పందించిన రాజేంద్రప్రసాద్!