ఇంకా ఎన్ని కామెడీ షోలు తెస్తారు రామోజీ గారు?
TeluguStop.com
తెలుగు బుల్లి తెర అంటే ఒకప్పుడు ఈటీవీ గుర్తుకు వచ్చేది.తెలుగు లో వచ్చిన మొదటి శాటిలైట్ ఛాన్స్ లో ఈటీవీ ఒకటి అనడంలో సందేహం లేదు.
ఒకప్పుడు సీరియల్స్ తో ఈటీవీ నెం.1 గా నిలిచింది.
కాల క్రమేనా ఇతర ఛానెల్స్ వచ్చాయి.వాటితో పోటీ పడటంలో ఈటీవీ సీరియల్స్ వెనుక పడ్డాయి.
పెద్ద ఎత్తున ఈటీవీ సీరియల్స్ వస్తున్నాయి.కాని వాటికి పెద్దగా రేటింగ్ వస్తున్నదే లేదు.
ఈ సమయంలో ఈటీవీ మొత్తం కూడా కామెడీ షో మరియు ఢీ షో తో కొనసాగుతుంది.
ఢీ షో ను కూడా ఈమద్య కాలంలో కామెడీ షో గా మార్చేశారు.
సుధీర్ మరియు ఆది ల కామెడీతో ఢీ కూడా కామెడీ షో మాదిరిగా మారి పోవడంతో చాలా మంది చూస్తున్నారు.
ఇక కొత్తగా శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ కొత్త షో మొదలు అయ్యింది.
అది కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది.పెద్ద ఎత్తున కామెడీ షో లు ఈటీవీని మంచి స్థానంలో నిలబెట్టడంతో ఈటీవీ ప్లస్ ఛానెల్ కూడా కామెడీ షో లపై ఆధారపడింది.
ఈటీవీ ప్లస్ లో గతంలో పటాస్ వచ్చేది.అది మంచి సక్సెస్ ను దక్కించుకుంది.
ఇక కొత్తగా ఈటీవీ ప్లస్ లో రెచ్చిపోదాం బ్రదర్ అనే షో ప్రారంభం అయ్యింది.
ఆ షో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రోమోలతో రెచ్చి పోతుంది.ప్రోమోలు ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటు ఇది మరో జబర్దస్త్ మరియు పటాస్ తరహాలో ఉంటుందనే నమ్మకంతో అంతా కూడా ఈ షో తో ఎంటర్ టైన్ అయ్యేందుకు సిద్దం అయ్యారు.
"""/"/ ఈనెల 7 నుండి ప్రారంభం అయిన రెచ్చి పోదాం బ్రదర్ కు ఒక మోస్తరుగా రేటింగ్ వస్తుంది.
అయినా కూడా ముందు ముందు ఈ షో తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో అంతా ఉన్నారు.
మల్లెమాల వారు రూపొందిస్తున్న ఈ షో కు రాజీవ్ కనకాల జడ్జ్ గా వ్యవహరిస్తున్నాడు.
ఇలా ముందు ముందు ఈటీవీ వారు మరెన్ని కామెడీ షో లు తీసుకు వస్తాడో అంటూ ప్రేక్షకులు లెక్కలు వేసుకుంటున్నారు.
వ్యూహం అదిరింది బాబాయ్ .. !