ఆ కోరిక తీరకుండానే మరణించిన రామోజీ రావు.. ఆ కోరిక ఏంటో తెలుసా?

తాజాగా టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీలో ఒక విషాదం చోటు చేసుకుంది.ఈనాడు మీడియా, ఉషా కిరణ్ మూవీస్ ( Enadu Media, Usha Kiran Movies )అధినేత, రామోజీ ఫిల్మ్ సిటీ ఫౌండర్ రామోజీ రావు శనివారం ఉదయం కన్నుమూశారు.

శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేయగా చికిత్స తీసుకుంటూ ఆయన తాజాగా మరణించారు.

ఇక ఆయన మరణంతో సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.ఇక ఆయన భౌతికకాయాన్ని ఇప్పటికే ఆయన నివాసానికి తరలించారు.

"""/" / ఇక పలువురు సెలబ్రిటీలు ఆయన మరణ వార్త తెలుసుకొని ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

కాగా ఉషా కిరణ్ మూవీస్ ద్వారా రామోజీ రావు( Ramoji Rao ) ఎంతో మంది యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్టులను, టెక్నీషియన్లను పరిచయం చేశారు రామోజీరావు.

ఈ ఉషా కిరణాలు అంటూ సినిమా ప్రారంభానికి ముందు వచ్చే ఆ గీతాన్ని వినని వారెవ్వరూ ఉండరు.

అలా ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, దర్శకులు పరిచయం అయ్యారు.

దర్శకుడు తేజ మొదటి సినిమా చిత్రం ఈ బ్యానర్‌ లోనే వచ్చింది.ఆ మూవీతోనే ఉదయ్ కిరణ్ వంటి వారు వచ్చారు.

"""/" / ఎంతో మంది హీరోలు, హీరోయిన్లను, టెక్నీషియన్లను ఈ ఉషా కిరణ్ బ్యానర్ ఇచ్చింది.

అయితే ఈ బ్యానర్‌లో వంద సినిమాలు తీయాలని రామోజీ రావు అనుకుంటూ ఉండేవారట.

కానీ ఇప్పటికీ ఆయన 94 లేదా 95 సినిమాలు మాత్రమే తీసి ఉంటారు.

వంద సినిమాలు అనేది తీరిన కోరికగానే మిగిలింది.రామోజీ రావు తన బ్యానర్లో వంద సినిమాలు తీయలేకపోయినా రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని వందల వేల లక్షల సినిమాలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి.

రామోజీ ఫిల్మ్ సిటీ వరల్డ్ ఫేమస్ అన్న సంగతి తెలిసిందే.అతి పెద్ద ఫిల్మ్ ప్రొడక్షన్ ప్లేస్‌గా రామోజీ ఫిల్మ్ సిటీకి ఉన్న పేరు గురించి అందరికీ తెలిసిందే.

బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అన్న తేడా లేకుండా అందరూ రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చి షూట్ చేసుకుని వెళ్తుంటారు.

బాలీవుడ్ వాళ్ళకి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా..?