కేంద్ర విమానాయన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు..!!
TeluguStop.com
మూడోసారి ప్రధాని అయిన నరేంద్ర మోదీ ( Narendra Modi )క్యాబినెట్ మంత్రివర్గం రెడీ అయింది.
ఈ మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ముగ్గురికి చోటు దక్కింది.తెలుగుదేశం పార్టీ నుండి ఇద్దరికీ బిజెపి నుండి ఒకరికి కేంద్ర మంత్రి పదవులు లభించాయి.
టీడీపీ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకి( MP Rammohan Naidu ) పౌర విమానాయన శాఖను కేటాయించారు.
2014లో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీకి ఇదే శాఖను అప్పగించారు.అప్పట్లో విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు ( MP Ashok Gajapathiraju )పౌర విమానాయన శాఖ క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.
కాగా వరుసగా శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు మూడోసారి గెలవడం జరిగింది. """/" /
ఉత్కంఠ భరితంగా జరిగిన ఏపీ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలుపొందారు.
దీంతో కేంద్ర మంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.ఇదిలా ఉంటే గతంలో వివిధ శాఖలకు వ్యవహరించిన వారే ఈసారి కూడా అదే పదవులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మల సీతారామన్, కేంద్ర హోం శాఖ మంత్రిగా అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జై శంకర్, కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ పదవులను అధిరోహించారు.
ఆరోగ్యానికి వరం చుక్కకూర.. వారానికి ఒక్కసారి తిన్న లాభాలే లాభాలు!