అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై వర్మ సంచలన పోస్ట్.. మెగాబలి అంటూ కామెంట్స్!
TeluguStop.com
టాలీవుడ్ సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) ప్రస్తుతం వార్తల్లో నిలిచారు.
ఇటు ఏపీ రాష్ట్ర రాజకీయాలలో అటు సినీ ఇండస్ట్రీలో కూడా ఈయన పేరు మారుమోగిపోతుంది.
రాంగోపాల్ వర్మ మీద ఏపీలో కేసు నమోదు కావడంతో ఈయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు అంటూ వార్తలు వచ్చాయి మరోవైపు కోర్టు కూడా సోమవారం వరకు ఈయనని అరెస్టు చేయకూడదు అంటూ తీర్పు కూడా ఇచ్చింది.
ఇలాంటి తరుణంలోనే వర్మ కాస్త వెనకడుగు వేసారని అందరూ భావిస్తున్న ఈయన మాత్రం తగ్గేదేలే అంటూ తనదైన శైలిలో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు.
"""/" /
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన పుష్ప 2 సినిమా( Pushpa 2 )డిసెంబర్ ఐదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఊహించని విధంగా అభిమానులు వచ్చి ఎంతో విజయవంతం చేశారు.అయితే ఈ వేడుకపై రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్ట్ మెగా అభిమానులకు( Mega Fans ) ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
"""/" /
ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న శారీ సినిమా పోస్టర్ ను షేర్ చేస్తూ.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది.పుష్ప2కి ఉన్న మెగా క్రేజ్ ను చూస్తే స్పష్టమైన రుజువులా అనిపిస్తుంది.
హే అల్లుఅర్జున్ , మీరు బాహుబలి కాదు స్టార్స్ యొక్క మెగాబలి అంటూ ఈయన చేసిన పోస్ట్ మెగా అభిమానులను( Mega Fans ) ఆగ్రహానికి గురిచేస్తుంది.
ఇప్పటికే మెగా వెర్సెస్ అల్లు అనే వివాదం ఇండస్ట్రీలో కొనసాగుతుంది ఇలాంటి తరుణంలోనే వర్మ కూడా మెగా అభిమానులను కించపరుస్తూ బన్నీ అభిమానులపై, బన్నీ క్రేజ్ పై చేసిన కామెంట్లు మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
అప్పుడు 100 రూపాయలు.. ఇప్పుడు రూ.300 కోట్లు.. బన్నీ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!