టీడీపీ పై ' వైరస్ ' వ్యాఖ్యలు ! వర్మకు ఎన్టీఆర్ కౌంటర్ కావాలా ?
TeluguStop.com
రామ్ గోపాల్ వర్మ పేరు కాదు కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రస్, రాజకీయం, సినిమా, అది ఇది అనే తేడా లేకుండా, అన్ని విషయాల్లోనూ తల దూర్చుతూ, అందరినీ తన ట్వీట్స్ తో రెచ్చ గొడుతూ, తాను నిర్మించే సినిమాల ద్వారానూ అందరినీ వెటకారం చేస్తూ, ఆ సినిమాలకు కావల్సినంత పబ్లిసిటీ తెచ్చుకోవడంలో వర్మ సక్సెస్ అవుతూనే ఉన్నారు.
అందుకే అయన ఎప్పుడూ వివాదాలను వెతుక్కుంటూ వెళ్తారు.తనకు సంబంధం లేని అంశాలలోనూ తల దూరుస్తూ, వివాదాస్పదం అవుతూ ఉంటారు.
తాజాగా రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉద్దేశించి కామెంట్స్ చేసారు.
అంతే కాదు ఎన్టీఆర్ ప్రస్తావన సైతం తీసుకోవడం వివాదాస్పదం అవుతోంది.తెలుగుదేశం పార్టీ కి నారా లోకేష్ అనే వైరస్ సోకిందని, దీనికి తారక్ అనే వ్యాక్సిన్ వేయించకపోతే టిడిపికి ప్రమాదమని, తెలుగుదేశం కార్యకర్తలు అంతా కలిసి వేగంగా పార్టీకి తారక్ అనే వ్యాక్సిన్ వేయించాలని, ఇది నా సలహా అంటూ రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
దీనిపై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది.ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీని పై మండి పడుతున్నారు.
గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేసిన , ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకి దూరంగా ఉన్నారని, ప్రస్తుతం సినిమాలపైనే దృష్టి పెట్టారని, కావాలని వర్మ మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చి ఇబ్బంది పెడుతున్నాడు అంటూ మండి పడుతుండగా, టిడిపి నాయకులు సైతం ఇదే విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ పార్టీ సంగతి తాము చూసుకుంటామని, ఆయన పని ఏదో ఆయన చూసుకోవాలని, మా జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరికలు చేస్తున్నారు.
72 ఏళ్ల వయసులో చంద్రబాబు ఉత్సాహంగా పని చేస్తున్నారని, మరో పదేళ్ల పాటు ఆయన యాక్టివ్ గా ఉంటారని, వేరొకరి అవసరం ఇప్పట్లో పార్టీకి లేదని, చంద్రబాబు సారథ్యంలో లోకేష్ సమర్ధుడైన నాయకుడిగా నిరూపించుకున్నారని, చంద్రబాబు తర్వాత లోకేష్ పార్టీని ముందుకు నడిపించగల రనే నమ్మకం తమకు ఉందని, అనవసరంగా మా పార్టీ అంతర్గత విషయాలు జోక్యం చేసుకోవద్దు అంటూ వర్మ కు వార్నింగ్ లు ఇచ్చేస్తున్నారు.
"""/"/
అయితే వర్మ అసలు ప్లాన్ అంతా టిడిపి స్పందన కోసం కాదని, ఈ అంశంలో తాను చేసిన ట్వీట్ కు జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలి అన్నట్లుగానే కనిపిస్తోంది.
చాలాకాలం నుంచి టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ రాకపై ప్రచారం జరుగుతున్నా, అటువైపు నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు.
దీంతో ఇదే అంశాన్ని వర్మ లేవనెత్తి , జూనియర్ ఎన్టీఆర్ స్పందన కోసం ఎదురు చూస్తున్నారని , ఆయన స్పందిస్తే దీనిపై మరింతగా కాంట్రవర్సీ పెరుగుతుందనే ఉద్దేశంతోనే, ఈ విధంగా చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కానీ ఇటువంటి వ్యవహారాల పై జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా స్పందించే అవకాశమే లేదు .
ఎందుకంటే చాలాకాలం నుంచి ఈ తరహా కామెంట్స్ వస్తున్న లైట్ తీసుకుంటున్నారు తప్ప, స్పష్టమైన ప్రకటన ఏది చేయడం లేదు.
ఇప్పుడు వర్మ ఎంత రెచ్చగొట్టినా, ఎన్టీఆర్ మాత్రం స్పందించే అవకాశం ఏమాత్రం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ట్రంప్ ఆ ప్లాన్ ప్రకటించగానే.. నవ్వు ఆపుకోలేకపోయిన హిల్లరీ క్లింటన్!