ఖిలాడీ డైరెక్టర్ కూడా పాన్ ఇండియా జపం.. డబుల్ డిజాస్టర్ ను మరిపిస్తాడా?
TeluguStop.com
ఇప్పుడు అందరికి పాన్ ఇండియా పిచ్చి పట్టింది.ఎవ్వరి మాట విన్న ఇదే పేరు వినిపిస్తుంది.
రాజమౌళి వేసిన బాటలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని సినిమాలు పాన్ ఇండియా అంటూ రిలీజ్ చేస్తున్నారు.
ఇక ఇప్పుడు డబుల్ డిజాస్టర్ అందుకున్న దర్శకుడు సైతం పాన్ ఇండియా జపం చేస్తుండడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది.
టాలీవుడ్ డైరెక్టర్ రమేష్ వర్మ తాజాగా ఈ రోజు పాన్ ఇండియా అంటూ ఐదు భాషల్లో సినిమా ప్రకటించాడు.
ఈయన రాక్షసుడు సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.తమిళ్ రాక్షస్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసి ఇక్కడ మంచి హిట్ కొట్టాడు.
ఈ సినిమా హిట్ తో ఆ తర్వాత మాస్ రాజా అవకాశం అందుకున్నాడు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ ఖిలాడీ సినిమాను తెరకెక్కించాడు.అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవుతుంది అనుకుంటే.
అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుని డబుల్ డిజాస్టర్ అయ్యింది.ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు రాక్షసుడు సినిమాకు సీక్వెల్ చేయబోతున్నాను అంటూ ఈ రోజు కొత్త సినిమాను ప్రకటించాడు.
"""/" /
అది కూడా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
'WHO' పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుండగా ట్రస్ట్ నో వన్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు.
ఇక ఈ సినిమాను పూజా ఎంటటైన్మెంట్ బ్యానర్ పై బాలీవుడ్ మేకర్స్ వాషు భగ్నానీ, జక్కీ భగ్నానీ, దీప్షిక దేశ్ ముఖ్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాతోనే రమేష్ వర్మ బాలీవుడ్ కి పరిచయం అవ్వబోతున్నారు.ఈ సినిమాను ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేసాడు.
ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించ నున్నాడు.
మిగతా వివరాలను త్వరలోనే తెలుపుతాను అంటూ చెప్పుకొచ్చాడు.
కెనడాలోని ఎన్ఆర్ఐలకు లాస్ట్ ఛాన్స్ .. ఈ వీకెండ్‌లో చివరి బ్యాచ్ కాన్సులర్ క్యాంప్‌లు