ఆడవాళ్ల పై రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తన వ్యాఖ్యలతో ప్రస్తుతం మరోమారు చిక్కుల్లో పడ్డారు.

మహిళల వస్త్రధారణ గురించి రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనను మరోమారు ఇరకాటంలోకి నెట్టాయి.

ఈ మధ్య కాలంలో ఆయన వివాదాలకు కేరాఫ్ గా మారారు.మహిళలపై అసభ్యకరంగా, కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య సమక్షంలో రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మహారాష్ట్రలోని థానేలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళా పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగాసైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి.

ఈ శిబిరానికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవిస్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా బాబా రాందేవ్ మహిళల్ని ఉద్దేశించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా మహిళల్లో ఆగ్రహం పెల్లుబుకుతుంది.

ఈ క్రమంలో యోగా గురు రాందేబవ్ బాబా సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అది కూడా మహిళల వస్త్రధారణపై అసభ్యకరంగా మాట్లాడారు.ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే బాబా రాందేవ్ ఈసారి మహిళల్ని ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.

ధానేలో జరిగిన కార్యక్రమంలో బాబా రాందేవ్ మహిళల్ని ఉద్దేశించి దారుణంగా మాట్లాడారు.నోరు జారారా లేదా ఉద్దేశ్యపూర్వకంగా మాట్లాడారా అనేది తెలియదు.

"""/"/ మహారాష్ట్ర థానే లోని పతంజలి యోగ పీఠం, అలాగే ముంబై మహిళల పతంజలి యోగ సమితి సంయుక్తంగా యోగా సైన్సు శిబిరాన్ని నిర్వహించాయి.

ఈ శిబిరానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు.

ఈ యోగా శిబిరానికి వచ్చిన మహిళలు అందరూ యోగ డ్రెస్సులలో వచ్చారు.ఆపై మహిళలకు ఏర్పాటుచేసిన యోగ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఆ తర్వాత ఒక ప్రత్యేక సమావేశం జరిగింది.అదే రోజు ఉదయం యోగా సైన్స్ శిబిరం జరిగింది.

ఆ తరువాత మహిళలకు యోగా శిక్షణా కార్యక్రమం ఏర్పాటైంది.ఇది ముగిసిన వెంటనే మహిళల సమావేశం ప్రారంభమైంది.

దాంతో మహిళలకు చీరలు ధరించే సమయం లేకపోయింది.ఈ పరిస్థితిపై మాట్లాడిన బాబా రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

చీరలు ధరించేందుకు సమయం లేనందున ఫరవాలేదని.ఇప్పుడైనా ఇంటికెళ్లి చీరలు ధరించి రావచ్చన్నారు.

మహిళలు చీరల్లో, సల్వార్ సూట్స్‌లో బాగుంటారని.తన కంటికైతే మహిళలు ఏం ధరించకోపోయినా బాగుంటారని వ్యాఖ్యానించారు.

రాందేవ్ బాబా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.మహిళల్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు.

బాబా రాందేవ్ తన నైజాన్ని బయటపెట్టారని ఆగ్రహిస్తున్నారు. """/"/ కాగా.

గతంలోనూ రాందేవ్ బాబా ఇలాంటి కామెంట్లే చేశారు.బాలీవుడ్ అగ్ర నటులు డ్రగ్స్ సేవిస్తున్నారని ఆరోపించారు.

బాలీవుడ్‌ ఇండస్ట్రీపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలతో మరోసారి బాలీవుడ్ ఉలిక్కిపడింది.ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో నిర్వహించిన ఆర్యవీర్‌, వీరాంగన సదస్సులో రాందేవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

యావత్‌ బాలీవుడ్‌ ఇండస్ట్రీ డ్రగ్స్‌ గుప్పిట్లో చిక్కుకుందని, సినిమా పరిశ్రమను డ్రగ్స్‌ చుట్టుముట్టిందని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ జరుగుతోందన్న రాందేవ్.డ్రగ్ అడిక్షన్ నుంచి భారత్‌ను విముక్తి చేసేందుకు మనమంతా కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.

"""/"/ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ తీసుకుంటాడని, ఆమీర్‌ ఖాన్‌ డ్రగ్స్‌ తీసుకుంటారా? లేదా? అనేది తనకు తెలియదని రాందేవ్ బాబా చెప్పారు.

హీరోయిన్ల డ్రగ్స్ వినియోగం గురించి దేవుడికి మాత్రమే తెలుసునని ఆక్షేపించారు.ఇందుకు సంబంధించిన వీడియో గతంలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మాదకద్రవ్య వ్యసనం నుండి భారతదేశాన్ని విముక్తి చేసేందుకు తీర్మానం చేయాలన్న రాందేవ్… ఇందుకోసం ఉద్యమం చేపడతామని వార్నింగ్ ఇచ్చారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కెన్యాలోని గుహ.. అసలేమైంది..?