గౌరవ డాక్టరేట్ అందుకోబోతున్న మెగా పవర్ స్టార్.. సంతోషంలో ఫ్యాన్స్?

సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి రామ్ చరణ్ ( Ramcharan ) ఇప్పటికే ఎన్నో అరుదైన పురస్కారాలను అందుకున్నారు.

ఇలా ఎన్నో అవార్డులను పురస్కారాలను సొంతం చేసుకున్నటువంటి ఈయన తాజాగా డాక్టరేట్( Doctorate ) అందుకున్నారు.

రామ్ చరణ్ కి తమిళనాడుకు చెందినటువంటి వేల్స్ యూనివర్సిటీ ( Wales University )ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది.

ఏప్రిల్‌ 13న జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.కళా రంగానికి చరణ్‌ చేస్తున్న సేవలను గుర్తించి డాక్టరేట్ అందిస్తున్నట్లు తెలుస్తోంది.

"""/" / ఈ విధంగా రామ్ చరణ్ కళారంగానికి అందిస్తున్నటువంటి సేవలను గుర్తించు ఆయనకు డాక్టర్ ప్రధానం చేస్తున్నారని విషయాన్ని ప్రకటించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే గతంలో కూడా ఇదే యూనివర్సిటీ నుంచి తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కు గౌరవ డాక్టర్ ప్రధానం చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ డాక్టరేట్ పవన్ కళ్యాణ్ అందుకోలేదు నాకంటే ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు అలాంటివారు అర్హులు అంటూ ఈ డాక్టరేట్ రిజెక్ట్ చేశారు.

"""/" / ఇలా పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేయడంతో అదే యూనివర్సిటీ నుంచి తిరిగి రామ్ చరణ్ కి డాక్టరేట్ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇకపై రామ్ చరణ్ కాస్తా డాక్టర్ రామ్ చరణ్ గా మారిపోయారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్  ( Game Changer ) సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత ఈయన బుచ్చిబాబు, సుకుమార్ డైరెక్షన్లో కూడా సినిమాలకు కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే.

కొబ్బరి పాలతో మీ కురులు అవుతాయి డబుల్.. ఎలా వాడాలంటే?