రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా ఆ జానర్ లో రాబోతోందా.. లీక్ చేసిన చరణ్!
TeluguStop.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan Tej ) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకోవడంతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు.
దీంతో ఈయన చేసే తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.
ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్(Shankar ) డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ ( Game Changer) సినిమా పనులలో బిజీగా గడుపుతున్నారు.
"""/" /
ఈ సినిమా ఈ ఏడాది చివరన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు డైరెక్షన్లో మరో పాన్ ఇండియా సినిమాకి కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి.
ఇలాంటి తరుణంలోనే రామ్ చరణ్( Ram Charan ) ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇంటర్వ్యూలో భాగంగా ఈయన రాపిడ్ ఫైర్ సెషన్ లో పాల్గొన్నారు.ఇందులో అడిగే ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు.
"""/" /
రామ్ చరణ్ ని యాంకర్ ప్రశ్నిస్తూ మీకు యాక్షన్ సినిమాలు అంటే ఇష్టమా లేక కామెడీ సినిమాలు అంటే ఇష్టమా అని ప్రశ్నించారు.
దీనికి రాంచరణ్ సమాధానం చెబుతూ తనకు యాక్షన్ సినిమాలు అంటేనే ఇష్టం అని తెలిపారు.
ఈ తరుణంలోనే బుచ్చిబాబు డైరెక్షన్లో ఈయన చేయబోయే సినిమా ఏ జానర్ లో రాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రకటించారు.
తాను త్వరలోనే కామెడీ జోనర్ ( Comedy Joner )లో సినిమా చేయబోతున్నానని చెప్పడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.
ఇక ఇందులో భాగంగానే మీకు ఇష్టమైన నేటి జనరేషన్ హీరో హీరోయిన్లు ఎవరు అని ప్రశ్నించడంతో కోలీవుడ్ హీరో సూర్య అలాగే నటి సమంత అంటే తనకు ఇష్టమని చరణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
చనిపోయిన కోళ్ల నుంచి ఎగిసిపడుతున్న మంటలు.. వీడియో చూసి నెటిజన్లు షాక్..