ప్రభాస్ పెళ్లిపై గుడ్ న్యూస్ చెప్పిన చరణ్…. అమ్మాయి వివరాలు లీక్!
TeluguStop.com
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక ప్రభాస్ నాలుగు పదుల వయసులోకి వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి కూడా చేసుకోకపోవడంతో ఈ కార్యక్రమానికి వెళ్లిన లేకపోతే ఎవరైనా హీరోలను ఇంటర్వ్యూ చేసిన తప్పనిసరిగా ప్రభాస్ పెళ్లి( Prabhas Marriage ) గురించి ప్రస్తావనకు వస్తుంది.
అయితే తాజాగా హీరో రామ్ చరణ్( Ram Charan ) ప్రభాస్ పెళ్లికి సంబంధించి బిగ్ సీక్రెట్ బయట పెట్టారు.
రామ్ చరణ్ తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బాలకృష్ణ( Balakrishna ) హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ప్రభాస్ కి ఫోన్ చేసి కొన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు.
"""/" /
ఈ క్రమంలోనే రామ్ చరణ్ ప్రభాస్ పెళ్లి గురించి సంచలన విషయాలను బయటపెట్టారు.
ఇప్పటివరకు ప్రభాస్ పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.అయితే రామ్ చరణ్ మాత్రం ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ ప్రభాస్ కు పెళ్లి ఫిక్స్ అయిందని త్వరలోనే తన పెళ్లి కూడా జరగబోతుందని శుభవార్తను తెలిపారు.
అంతేకాకుండా ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వివరాలను కూడా ఈయన బయటపెట్టారు. """/" /
ప్రభాస్ కు తూర్పు గోదావరి జిలా గణపవరంకి చెందిన అమ్మాయితో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయినట్లు రాంచరణ్ తెలిపారు.
ఈ ఎపిసోడ్ జనవరి 14న ప్రసారం కాబోతోంది.మరి పూర్తి ఎపిసోడ్ లో రామ్ చరణ్ ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఇంకా ఎలాంటి విషయాలను తెలియజేశారనేది తెలుస్తుంది.
అదే ఇప్పటికే ప్రభాస్ ఫలానా హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తలు అన్నింటిని కూడా పూర్తిగా ఖండించారు.
ఇక రామ్ చరణ్ మాటలను బట్టి చూస్తుంటే ఈయన పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తుంది.
మరి ప్రభాస్ పెళ్లి గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
మయన్మార్‌లో సంస్కృతంలో బోధన .. రాజస్థాన్ ఎన్ఆర్ఐకి ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్’