Ramcharan : ఉమెన్స్ డే స్పెషల్ అమ్మ కోసం గరిట పట్టిన చరణ్.. ఏం వండారో తెలుసా?
TeluguStop.com
మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ( Womens Day ) కావడంతో పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఉమెన్స్ డేని ఎంతో ఘనంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే మెగా ఇంట్లో కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా జరిగాయి.
ఉమెన్స్ డే సందర్భంగా రామ్ చరణ్ (Ramcharan ) తన ఇంట్లో ఉన్నటువంటి వారికి స్పెషల్ గా వంట చేసి పెట్టారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియోని ఉపాసన ( Upasana ) సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.
"""/" /
ఇందులో భాగంగా రామ్ చరణ్ తన అమ్మ కోసం వంట చేస్తూ ఉండగా ఉపాసన వీడియో తీస్తూ ఉన్నారు.
పక్కనే సురేఖ ( Surekha ) కూడా ఉన్నారు.దీంతో ఉపాసన తన అత్తయ్యతో మాట్లాడుతూ అత్తమ్మగారండీ ఈరోజు వంటింట్లో ఏం జరుగుతుంది అని అడగగా సురేఖ వంటింట్లో దోస అవుతుంది.
నా కొడుకు నాకోసం చేస్తున్నాడు ఉమెన్స్ డే అని చెబుతుంది ప్రతిరోజు ఉమెన్స్ డే అయితే ఎంతో బాగుండు అంటూ ఉపాసన మాట్లాడుతుంది.
అనంతరం రామ్ చరణ్ గారండీ ఏం చేస్తున్నారు అంటూ ఉపాసన చరణ్ ని కూడా అడిగింది.
"""/" /
చరణ్ ఉపాసనకు రిప్లై ఇస్తూ దోశ పన్నీర్ టిక్కా అమ్మ కోసం చేస్తున్నాను అంటూ చెప్పకు వచ్చారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా రాంచరణ్ అమ్మ కోసం స్పెషల్ గా వంట వండుతున్నటువంటి ఈ వీడియో చూసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా అనంతరం బుచ్చిబాబు దర్శకత్వంలో తదుపరి సినిమాను చేయబోతున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ కు భారీ స్థాయిలో క్రేజ్.. ఈ సీక్వెల్స్ హిట్టవుతాయా?